Sourav Ganguly: రాజకీయాల్లోకి గంగూలీ?

మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. ‘‘ఈ ఏడాదితో క్రికెట్లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు క్రికెట్ నాకు చాలా ఇచ్చింది.

Sourav Ganguly: రాజకీయాల్లోకి గంగూలీ?

Sourav Ganguly

Sourav Ganguly: మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. ‘‘ఈ ఏడాదితో క్రికెట్లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు క్రికెట్ నాకు చాలా ఇచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా మీ సహకారం నాకు దొరికింది. ఈ స్థాయికి చేరుకునేందుకు ఇన్నేళ్ల నా ప్రయణంలో నాకు సహకరించిన వాళ్లందరికీ నా ధన్యవాదాలు.

New District Courts: రేపటి నుంచి కొత్త జిల్లాల కోర్టుల్లో సేవలు ప్రారంభం

చాలా మందికి మేలు చేస్తుందనిపించే కొత్త నిర్ణయాన్ని ఈ రోజు తీసుకోబోతున్నా. ఈ నా కొత్త అధ్యాయానికి కూడా మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నా’’ అంటూ గంగూలీ బుధవారం సాయంత్రం ట్వీట్ చేశాడు. దీంతో ఆయన చెప్పిన కొత్త అధ్యాయం రాజకీయాల గురించే అయ్యుంటుందని చాలా మంది భావిస్తున్నారు. నిజానికి ఎప్పట్నుంచో గంగూలీ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన బీజేపీలో చేరుతారని సమాచారం. గత ఎన్నికల్లోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినా.. అది నిజం కాలేదు. అయితే ఇటీవల గంగూలీ, కోల్‌కతాలోని తన నివాసంలో బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తాజాగా గంగూలీ చేసిన ట్వీట్‌తో ఇది నిజమేననిపిస్తోంది.

Girl Rape case: బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

మరోవైపు గంగూలీని రాజకీయాల్లోకి తేవాలని బీజేపీ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి సరైన నేత లేరు. దీంతో గంగూలీతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటోంది. మమతకు పోటీగా గంగూలీని దించే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఈ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.