PM Modi: స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని మోదీ.. వీడియో పోస్టు చేసిన కేంద్ర మంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ స్ఫూర్తిని చాటారు. స్వయంగా చెత్తను తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటిచెప్పారంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

PM Modi: స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని మోదీ.. వీడియో పోస్టు చేసిన కేంద్ర మంత్రి

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ స్ఫూర్తిని చాటారు. స్వయంగా చెత్తను తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటిచెప్పారంటూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఢిల్లీలో నిర్మించిన ఐటీపీవో టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీవో టన్నెల్ ను పరిశీలించారు. ఈ ప్రాంతంలో చిన్నపాటి వ్యర్థాలు ఉండటాన్ని గమనించిన మోదీ స్వయంగా వాటిని తొలగించారు. ఒక్కరే పరిసర ప్రాంతాలను తిలకిస్తూనే అక్కడక్కడ పడిఉన్న చిన్నపాటి వ్యర్థాలను తొలగిస్తూ వీడియోలో కనిపించారు.

Viral Video: కుక్కపిల్ల తిరిగినట్లు వీధుల్లో తిరిగిన పులి.. వణికిపోయిన స్థానికులు.. ఓ వ్యక్తి వచ్చి..

అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రగతి మైదాన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు లో అంతర్భాగమే. ఈ ప్రగతి మైదాన్ సమీకృత రవాణా కారిడార్. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో కేంద్రం కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ ను అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు కోవిడ్ తో సహా అనేక అడ్డంకులు ఎదురయ్యాయని ప్రధాని తెలిపారు. న్యాయ విధానాలు అడ్డు వచ్చాయని, కానీ చివరకు సాధించామని ప్రధాని ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలిపారు.