PM Modi : ఒక్క క్లిక్ చేస్తే..మీ ఆరోగ్య సమాచారం

నరేంద్రమోదీ సర్కార్ ఆరోగ్య రంగంలో మరో సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్‌మిషన్‌ను ప్రారంభించబోతోంది. 

PM Modi : ఒక్క క్లిక్ చేస్తే..మీ ఆరోగ్య సమాచారం

Pm Health

Digital Health Mission : నరేంద్రమోదీ సర్కార్ ఆరోగ్య రంగంలో మరో సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్‌మిషన్‌ను ప్రారంభించబోతోంది.  ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని అందులో నిక్లిప్తం చేయబోతున్నారు. ఆరోగ్యరంగంలో ఈ పథకం పెనుమార్పులు తీసుకురాబోతోందని భావిస్తున్నారు..క్లిక్ చేస్తే చాలు మీ ఆరోగ్య సమాచారమంతా బయటకొస్తుంది. ఏఏ ఆరోగ్య సమస్యలున్నాయి, ఎప్పుడెలాంటి సర్జరీలు జరిగాయి వంటి వివరాలన్నీ వెల్లడవుతాయి. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొస్తున్న డిజిటల్  హెల్త్ మిషన్ ప్రత్యేకత ఇదే. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్ధాయిలో డిజిటల్ హెల్త్ మిషన్ అమలుకు సిద్ధమవుతోంది.

Read More : Kamreddy : పెళ్లయిన నెలకే…భార్య గొంతు కోసి చంపేసిన కిరాతక భర్త

ఈ పథకం కింద ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ఐడీలను ఇస్తారు. ఆ ఐడీల్లో ఆ వ్యక్తికి సంబంధించిన సమగ్ర ఆరోగ్య సమాచారం ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు చికిత్స అందించాల్సి వచ్చినా, మందులు తీసుకోవాల్సి వచ్చినా దానికి ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. ఈ మిషన్‌లో డిజిటల్ హెల్త్‌ ఐడీ, హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ, హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అని నాలుగు భాగాలుంటాయి. ఆధార్, మొబైల్ నెంబర్‌తో ఈ ఐడీని అటాచ్‌ చేస్తారు. ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత దేశంలోని మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు విస్తరిస్తారు. ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రసంగం సమయంలో ప్రధాని మోదీ డిజిటల్ హెల్త్ మిషన్‌ ప్రస్తావన తీసుకొచ్చారు.

Read More : Drugs Into India : భారత్ లోకి నిషేధిత డ్రగ్స్ అసలు ఎలా వస్తున్నాయో తెలుసా

ఇప్పుడు దాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు రకరకాల ఆరోగ్య పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే దేశస్థాయిలో పౌరుల పూర్తిస్థాయి ఆరోగ్య డేటా మాత్రం అందుబాటులో ఉండటం లేదు. దీంతో డాక్టర్లు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీన్నుంచి వారిని బయటపడేసేందుకు, వేగంగా చికిత్స అందించేందుకు వీలుగా కేంద్రం ఈ డిజిటల్ హెల్త్ మిషన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఏ ఆసుపత్రికి వెళ్లినా ముందుగా డిజిటల్ హెల్త్‌ ప్రొఫైల్‌ను చూస్తారు. గతంలో ఉన్న సమస్యలన్నీ ఒక్క క్లిక్‌తో తెలిసిపోతాయి. ఒకవేళ కొత్తగా పరీక్షలు చేసినా ఆ వివరాలను అందులో చేరుస్తారు. దీని వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.