CM Father arrest బ్రాహ్మణులపై సీఎం తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. అరెస్ట్!

‘బ్రాహ్మణులు భారతీయులు కాదు..వారిని గంగా నది నుంచి ఓల్గా నదికి పంపించేయాలి..అంటూవ్యాఖ్యానించిన ఛత్తీస్ గఢ్ సీఎం తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

CM Father arrest బ్రాహ్మణులపై సీఎం తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. అరెస్ట్!

Chhattisgarh Cm Father Arrests

Chhattisgarh CM father arrests : ‘బ్రాహ్మణుల్ని గంగా నది నుంచి ఓల్గా నదికి పంపించేయాలి..బ్రాహ్మణులు మన దేశానికి చెందినవారు కాదు. వారు మనల్ని అంటరానివారుగా చూస్తుంటారు. మన హక్కులన్నీ లాగేసుకున్నారు. అందుకే బ్రాహ్మణులను ఎవరూ గ్రామాల్లోకి రానివ్వకూడదు..వారిని బహిష్కరించాలి” అంటూ బ్రాహ్మణసమాజంపై తీవ్రవ్యాఖ్యలు చేసిన ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తండ్రి నందకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు నందకుమార్ బఘేల్ ను రాయ్ పూర్ కోర్టులో హాజరు పరిచారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దాంతో ఆయనను పోలీసులు జైలుకు తరలించారు.

86 ఏళ్ల నందకుమార్ బఘేల్ రాయ్ బ్రాహ్మణులపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం రాష్ట్రంలో పెను దుమారానికి దారి తీసింది.ఆయన వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. బ్రాహ్మణులను గంగా నది నుంచి వోల్గా నదికి పంపించి వేయాలి…వాళ్లు భారతీయులు కాదు..వారు విదేశీయులు.. వారిని బహిష్కరించాలి అంటూ చేసిన వ్యాఖ్యలపై శనివారం సర్వ బ్రాహ్మణ సమాజ్ డీడీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.మా మనోభావాలు దెబ్బతీసేలా సీఎం తండ్రి వ్యాఖ్యానించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో నందకుమార్ బఘేల్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయపూర్‌లోని కోర్టులో హాజరుపరిచారు.

తండ్రిపై కేసు నమోదైన క్రమంలో సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని..చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. భారతదేశంలో అన్ని కులాలు..మతాలు సమానమేనని ఎవ్వరిని కించపరిచేలా వ్యాఖ్యానించకూడదని అన్నారు.

కాగా గంగానది భారతదేశంలో అతి పవిత్రమైన నదిగా భావిస్తారు. అలాగే వోల్గా నది ఐరోపాలోనే అతి పెద్ద నది. వోల్గా నది..మధ్య రష్యా గుండా కాస్పియన్ సముద్రం లోకి ప్రవహిస్తోంది. రష్యా జాతీయ నదిగా వోల్గా నదికి విశిష్ట స్థానముంది. ఈ నది పొడవు 3,531 కి.మీటర్లు. ఈ నది పరీవాహక ప్రాంతం 13,60,000 చ.కి.మీ. భౌగోళికంగా దీనికున్న స్థానం కారణంగా వోల్గా తూర్పు పడమరల మధ్య, ఉత్తర దక్షిణాల మధ్యా ప్రజల రవాణాలో ముఖ్యమైన పాత్ర పోషించింది. చారిత్రికంగా వోల్గా నది యూరేసియన్ నాగరికతలకు ముఖ్యమైన సంగమస్థానంగా నిలిచింది.

వోల్గా నది రష్యాలోని అడవుల గుండా, అడవుల స్టెప్పీల గుండా, స్టెప్పీల గుండా ప్రవహిస్తుంది. మాస్కోతో సహా, రష్యా లోని 11 ఐ పెద్ద నగరాలు వోల్గా పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. ప్రపంచం లోని అతొపెద్ద జలాశయాల్లో కొన్ని వోల్గా వెంట ఉన్నాయి.వోల్గా రష్యా సంస్కృతిలో ప్రధానమైన అంశంగా విరాజిల్లుతోంది. రష్యను సారస్వతంలో, జానపదంలో వోల్గాను వోల్గా మాత (వోల్గా మతూష్క) అని అంటారు.