polygamy: బహుభార్యత్వంపై మీ వైఖరేంటి.. కేంద్రానికి ఢిల్లీ హై కోర్టు ప్రశ్న

ముస్లింల బహుభార్యత్వంపై తన వైఖరేంటో స్పష్టం చేయాలని కేంద్రానికి సూచించింది ఢిల్లీ హైకోర్టు. భార్య ఉండగానే, ఆమె అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.

polygamy: బహుభార్యత్వంపై మీ వైఖరేంటి.. కేంద్రానికి ఢిల్లీ హై కోర్టు ప్రశ్న

Polygamy

polygamy: ముస్లింల బహుభార్యత్వంపై తన వైఖరేంటో స్పష్టం చేయాలని కేంద్రానికి సూచించింది ఢిల్లీ హైకోర్టు. భార్య ఉండగానే, ఆమె అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ముస్లింలు బహుభార్యలు కలిగి ఉండటం రాజ్యాంగ వ్యతిరేకమని మహిళ తన పిల్‌లో పేర్కొంది. భార్య ఉండగా భర్త వేరే పెళ్లి చేసుకుంటే, భార్య జీవనానికి కావాల్సిన వసతి, సౌకర్యాలు వంటివి సమకూర్చాలని కూడా పిటిషన్‌లో కోరింది.

Delhi : ఢిల్లీ పేరు మార్చి ‘ఇంద్రప్రస్థ’ అని పెట్టాలంటూ డిమాండ్

సోమవారం ఈ పిల్ విచారణ సందర్భంగా కోర్టు కేంద్రాన్ని తన వైఖరేంటో చెప్పాలని కోరింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హై కోర్టు చీఫ్ జస్టిస్ విపిన్ సింగ్, జస్టిస్ నవీన్ చావ్లాలతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై విచారణ జరుపుతోంది. ఈ కేసు విచారణను వచ్చే ఆగష్టు 23కు వాయిదా వేసింది. ముస్లింలు అనుసరించే షరియత్ చట్టాల ప్రకారం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ముస్లింలలో బహుభార్యత్వాన్ని అనుమతిస్తారని పిల్‌ దాఖలు చేసిన మహిళ పేర్కొంది. అలాగే ముస్లింల వివాహాలను రిజిస్ట్రేషన్ కూడా చేయించాలని కోరింది.