Pongal rush: సంక్రాంతి సందడి.. పట్నం వదిలి పల్లెలకు.. కాస్త భయం!

సంక్రాంతి సెలవులు స్టార్ట్ అయ్యాయి. జనమంతా పల్లె బాట పడుతున్నారు.

Pongal rush: సంక్రాంతి సందడి.. పట్నం వదిలి పల్లెలకు.. కాస్త భయం!

Pongal rush

Pongal rush: సంక్రాంతి సెలవులు స్టార్ట్ అయ్యాయి. జనమంతా పల్లె బాట పడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ ప్లాజాల వద్ద అప్పుడే సంక్రాంతి రష్ కనిపిస్తోంది. పండగ రద్దీకి అనుగుణంగా ఇరు రాష్ట్రాల ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. దక్షిణ మధ్య రైల్వే కూడా.. ప్రయాణికులకు స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి తెచ్చింది. మరో రెండు రోజుల్లో.. రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో.. అప్పుడే సంక్రాంతి రష్ కనిపిస్తోంది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్, సికింద్రాబాద్‌ రైల్వే జంక్షన్‌లలో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. జనమంతా పండగకు సొంతూళ్లకు వెళ్తున్నారు. ప్రయాణికుల కోసం పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ 4 వేల 318 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకుని రాగా.. అందులో ఏపీకి 984బస్సులను నడుపుతున్నారు.

ప్రయాణికులు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని, మాస్క్‌ ధరించే.. బస్సులో ప్రయాణించాలనే రూల్ పెట్టింది తెలంగాణ ఆర్టీసీ. ఇంకా కూడా చాలా చోట్ల సొంతూళ్లకు వెళ్లేందుకు స్టేషన్‌కు వస్తున్న ప్రయాణికులు కరోనా నిబంధనలు పాటించడం లేదు. మాస్క్‌లు, సోషల్ డిస్టెన్స్‌ను పట్టించుకోవడం లేదు. దీంతో.. వైరస్ వ్యాప్తి పెరుగుతుందేమో అనే ఆందోళన కూడా అధికారుల్లో ఎక్కువైంది.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనే కాదు.. టోల్ ప్లాజాల దగ్గర కూడా క్రమంగా రష్ ఎక్కువవుతోంది. కరోనా వేళ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించేందుకు జంకుతున్న కొందరు సొంత వాహనాలు, అద్దె వాహనాల్లో ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ సాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి దగ్గర.. నిమిషాల వ్యవధిలోనే వందలాది వాహనాలు టోల్ గేట్ క్రాస్ చేస్తున్నాయి.

అయితే.. రోడ్డు మార్గంలో ఇంటికెళ్తున్న వారిని.. పొగమంచు ఇబ్బంది పెడుతోంది. తెల్లవారుజామున ట్రాఫిక్ తక్కువ ఉంటుందని బయల్దేరుతున్న వాళ్లందరికీ.. పొగ మంచు అడ్డుతగులుతోంది. పొగమంచు కమ్మేస్తుండటంతో.. ముందు వెళ్లే వాహనాలు సరిగా కనిపించడం లేదు. దీంతో.. వాహనాలు నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. సంక్రాంతి పండుగకు.. పట్నం వదిలి చాలా మంది ఊళ్లకు వెళ్తున్నారు.

మోతాదుకు మించి నిమ్మరసం తీసుకుంటే ప్రమాదమే..!

ప్రతి పండుగకూ బంధువులు తిరిగి వస్తే, సంతోషంగా భావించే ఊళ్లు మాత్రం మూడో వేవ్ ఆందోళనలు వ్యక్తం అవుతున్న క్రమంలో కాస్త ఆందోళన కూడా వ్యక్తం చేస్లున్నారు. గ్రామాల్లో ప్రజలను కరోనా భయం వెంటాడుతోంది. రెండు రాష్ట్రాల్లో రోజురోజుకు కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వ్యాప్తి మధ్య పట్నాల నుంచి వస్తున్న పల్లె వాసుల విషయంలో కాస్త ఆందోళన మాత్రం కనిపిస్తుంది.