Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై పూనమ్ కౌర్ వైరల్ కామెంట్స్.. అహంకారామా..? అజ్ఞానమా..?

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. అహంకారామా లేదా అజ్ఞానమా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై పూనమ్ కౌర్ వైరల్ కామెంట్స్.. అహంకారామా..? అజ్ఞానమా..?

Pawan Kalyan | Ustaad Bhagat Singh

Updated On : May 11, 2023 / 5:40 PM IST

Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నేటితో (మే 11) గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి అవ్వడంతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉస్తాద్ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ గ్లింప్స్ టైం ని అనౌన్స్ చేస్తూ నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. పవర్ స్టార్ లుక్ అదిరిందిగా..

ఆ పోస్టర్ లో పవన్ కాళ్ళని మాత్రమే చూపించారు. ఇక మూవీ టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్ ని పవన్ కాళ్ళ దగ్గర వేశారు. ఆ టైటిల్ ని అక్కడ వేయడం ఏంటని పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మనం స్వాతంత్ర సమరయోధులను గౌరివించక పోయిన పర్వాలేదు. కానీ అవమానించకండి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లో భగత్ సింగ్ పేరుని కాళ్ళ దగ్గర పెట్టడం ఏంటి? అహంకారామా లేదా అజ్ఞానమా? అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Pawan Kalyan : పవన్ షూటింగ్స్ కు పొలిటికల్ గ్యాప్.. ఇంకా స్పీడ్ గా సినిమాలు పూర్తి చేయాలి అంటున్న అభిమానులు..

కాగా ఈ భామ గతంలో కూడా పలుమార్లు పవన్ కళ్యాణ్ పై వైరల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసి పవన్ అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది.