ఏపీలో పొలాల్లో PPE కిట్ల కలకలం… కరోనా భయంతో తగలబెట్టాడు

ఏపీలోని పొలాల్లో పీపీఈ(PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్లు కలకలం రేపాయి. క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 03:21 AM IST
ఏపీలో పొలాల్లో PPE కిట్ల కలకలం… కరోనా భయంతో తగలబెట్టాడు

ఏపీలోని పొలాల్లో పీపీఈ(PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్లు కలకలం రేపాయి. క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌

ఏపీలోని పొలాల్లో పీపీఈ(PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్లు కలకలం రేపాయి. క‌రోనా పేషెంట్ల‌కు వైద్య‌ సేవ‌లు అందిస్తున్న డాక్టర్లు ధ‌రించే పీపీఈ కిట్ల బాక్సులు పొలాల్లో ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఈ ఘ‌ట‌న ఏపీలోని అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం పరిధిలోని బోరంపల్లిలో చోటుచేసుకుంది. రోడ్డు ప‌క్క‌న ఉన్న పొలాల్లో రెండు బాక్సులు ప‌డి ఉన్నాయి. దీన్ని గ‌మ‌నించిన స్థానిక యువకుడు బాక్సులు తెరిచి చూశాడు. అందులో డాక్టర్లు ధ‌రించే పీపీఈ కిట్లు ఉన్నాయి. దీంతో అతడు తీవ్ర ఆందోళ‌న‌ చెందాడు. వెంటనే కొన్నింటిని అక్క‌డే త‌గ‌ల‌బెట్టాడు. వాటి ద్వారా క‌రోనా సోకుతుందేమో అన్న భ‌యంతో తాను ఈ పని చేశానని చెప్పడం గ‌మ‌నార్హం. 

తరలించే క్రమంలో జారిపడ్డాయా?
మ‌రో బాక్స్‌ను ఓ యువ‌కుడు స్థానిక పోలీస్‌ స్టేష‌న్‌లో అప్ప‌గించాడు. దీనిపై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. ఈ పీపీఈ కిట్లు త‌మ‌వేన‌ని జిల్లా వైద్యాధికారులు చెబుతుండ‌గా.. స్థానిక అధికారులు మాత్రం ఈ పీపీఈ కిట్ల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని అంటున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. ఓ వైపు పీపీఈ కిట్లు లేక వైద్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటే, ఇలా పొలాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌డం ఏమిట‌న్న‌న‌దానిపై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. కాగా, కిట్ల‌ను త‌ర‌లించే క్ర‌మంలో జారి రోడ్డుప‌క్క‌న ఉన్న పొలాల్లో ప‌డి ఉండొచ్చని మ‌రికొంద‌రు అంటున్నారు. 

ppe

పీపీఈ కిట్లలో ఏముంటాయంటే:
కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్లు తమకు కరోనా సోకుకుండా పీపీఈ కిట్లు ధరిస్తారు. ఇందులో గౌన్, షూస్, క్యాప్, ఎన్-95 మాస్క్, గాగుల్స్, డబుల్ గ్లోవ్స్ ఉంటాయి. వీటిని ధరించాక లోపలికి గాలి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. అయినా వైరస్ నుంచి రక్షణ అభిస్తుందన్న భరోసా ఏమీ లేదని డాక్టర్లు చెబుతున్నారు. వీటిని రోజంతా వేసుకోవడం వల్ల ఊపిరి ఆడని పరిస్థితి వస్తోందని, అయినా చికిత్స చేస్తున్నామని చెప్పారు.

ఏపీలో 2100 కరోనా కేసులు, 48 మరణాలు:
ఏపీలో గురువారం(మే 14,2020) మరో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 5.. కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో రెండేసి కేసుల చొప్పున.. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక కేసు నమోదైంది. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2100ని ప్రభుత్వం చెబుతోంది.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 860గా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 591 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 404 కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1192మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 48మంది చనిపోయారు.

Read Here>> ఏపీ, తమిళనాడును వణికిస్తున్న ‘కోయంబేడు’