Adipurush: ప్రభాస్ పక్కా ప్లాన్.. ఆదిపురుష్ డేట్ ఫిక్స్!

మన తెలుగు హీరో ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సూపర్ హీరోగా భారీ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా షూట్ చివరి దశకు తెచ్చిన ప్రభాస్.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను పట్టాలెక్కించాడు.

Adipurush: ప్రభాస్ పక్కా ప్లాన్.. ఆదిపురుష్ డేట్ ఫిక్స్!

Adipurush

Adipurush: మన తెలుగు హీరో ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సూపర్ హీరోగా భారీ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా షూట్ చివరి దశకు తెచ్చిన ప్రభాస్.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను పట్టాలెక్కించాడు. ఆదిపురుష్ ఇప్పటికే ముమ్మర షూటింగ్ జరుపుకుంటుండగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు.

వచ్చే ఏడాది ఆగస్ట్ 11న తమ ఆదిపురుష్ విడుదల చేస్తామని దర్శకుడు ఓంరౌత్ ప్రకటించాడు. సరిగ్గా ఏడాది టార్గెట్ పెట్టుకున్న దర్శకుడు ఇప్పటి నుండే హైప్ పెంచేందుకు సిద్దమైనట్లు కనిపిస్తుంది. సరిగ్గా ఏడాదిలో ప్రభాస్ మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ బ్లాస్ట్ కి రెడీ అవడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఈ ఏడాది మధ్యలోనే సలార్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉండగా సరిగ్గా ఏడాదికి ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఏడాదిలో ప్రభాస్ అభిమానులకు డబుల్ ట్రీట్ గా మారనుంది.

అపూర్వ ఇతిహాస గాథ రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ పై ఇండియా లెవెల్ లో అంచనాలుండగా కథకు అనుగుణంగా ఈ సినిమా కోసం భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండడం కారణంగానే ఏడాది సమయం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. సలార్, ఆదిపురుష్ సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మహానటి దర్శకుడు, నిర్మాత అశ్వనీదత్ కాంబినేషన్ లో మరో ప్రాజెక్టుకు కూడా కొబ్బరి కాయ కొట్టేసిన సంగతి తెలిసిందే.