Lokesh Kanagaraj : ప్రభాస్ తమిళ డైరెక్టర్ కి ఛాన్సిచ్చాడా??

ఇప్పటికే ప్రభాస్ భారీ లైనప్ తో ఉన్నాడు. ఉన్న సినిమాలే ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియదు. కానీ ఇంకా కొత్త కథలు వింటున్నాడట ప్రభాస్. తాజాగా యువీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో ప్రభాస్ తో స్టైల్ యాక్షన్ మూవీని లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నాడని....................

Lokesh Kanagaraj : ప్రభాస్ తమిళ డైరెక్టర్ కి ఛాన్సిచ్చాడా??

prabhas said ok to lokesh kanagaraj movie

Lokesh Kanagaraj :  గట్టిగా 4,5 సినిమాలు చెయ్యలేదు కానీ వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమా ఆఫర్లొస్తున్నాయి. ఇండస్ట్రీకొచ్చి 5 ఏళ్లు అయ్యిందో లేదో సౌత్ స్టార్ హీరోలందరూ ఈ డైరెక్టరే కావాలంటున్నారు. కాన్సెప్ట్ మూవీస్ తో పాటు కమర్షియల్ కంటెంట్ ని కూడా అందిస్తూ అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాడు అరవ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.

లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తమిళ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్. తమిళ్ లో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు కొడుతున్న ఈ యంగ్ డైరెక్టర్ త్వరలో విజయ్ తో సినిమా చేయనున్నాడు. అది కాకుండా ఖైదీ 2, విక్రమ్ 2 కూడా ఈ డైరెక్టర్ చేతిలో ఉన్నాయి. అటు తమిళ్ లో బిజీగా ఉంటూనే తెలుగులో కూడా సినిమాల మీద ఫోకస్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా విక్రమ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన లోకేష్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటూ టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే ప్రభాస్ భారీ లైనప్ తో ఉన్నాడు. ఉన్న సినిమాలే ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియదు. కానీ ఇంకా కొత్త కథలు వింటున్నాడట ప్రభాస్. తాజాగా యువీ క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో ప్రభాస్ తో స్టైల్ యాక్షన్ మూవీని లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. గతంలో మాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన లోకేష్ తెలుగు హీరోలతో సినిమా చెయ్యడానికి ట్రై చేస్తున్నా అని హింట్ ఇచ్చారు. రామ్ చరణ్ కి స్టోరీ చెప్పానని, ఆయన ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నానని కూడా చెప్పాడు లోకేష్. తనుకున్న కమిట్మెంట్స్ అయిపోగానే చరణ్ తో తప్పకుండా బిగ్గెస్ట్ మూవీ చేస్తానని అన్నాడు. మరి ఏమైందో తెలీదు కానీ ఆ సినిమా గురించి అసలు ఇప్పుడు టాక్ కూడా వినిపించట్లేదు.

Shimbu : నిఖిల్ కోసం తమిళ్ స్టార్ హీరో.. మళ్ళీ తెలుగు పాట కోసం వస్తున్న శింబు..

తమిళ్ లో వరుస హిట్స్ కొట్టిన లోకేష్ ఇప్పటికే తమిళ్ లో మరో మూడు సినిమాలని లైన్లో పెట్టి ఇప్పుడు తెలుగులో కూడా హిట్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. మరి నిజంగానే ప్రభాస్ తో లోకేష్ సినిమా ఓకే అయిందా, ఓకే అయితే ఎప్పుడు దీని గురించి ప్రకటిస్తారు అని అంత ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు అయితే అధికారిక ప్రకటన రాలేదు.