Salaar : డైనోసార్ వచ్చే సమయం అయ్యింది.. సలార్ నుంచి ప్రభాస్ గ్లింప్స్.. పోస్ట్ వైరల్..

సలార్ నుంచి అదిరే అప్డేట్ వచ్చేసింది. డైనోసార్ ఎంట్రీకి టైం అయ్యిందంటూ..

Salaar : డైనోసార్ వచ్చే సమయం అయ్యింది.. సలార్ నుంచి ప్రభాస్ గ్లింప్స్.. పోస్ట్ వైరల్..

Prabhas teaser is coming from Salaar Part 1 Ceasefire

Updated On : August 3, 2023 / 7:52 PM IST

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానుల ఎదురుచూపులు అన్ని ‘సలార్’ పైనే ఉన్నాయి. కేజీఎఫ్ చిత్రాలు తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మొదటి పార్ట్ ని ‘Ceasefire’ అనే పేరుతో సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. కాగా ఈ మూవీ నుంచి ఇటీవలే ఒక చిన్న టీజర్ రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.

Anupama Parameswaran : కొత్త ట్రెండ్‌ని స్టార్ట్ చేస్తున్న అనుపమ.. అది ఏంటో తెలుసా..?

అయితే ఆ టీజర్ లో ప్రభాస్ పేస్ ని కాదు కదా, డైలాగ్స్ కూడా వినిపించలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశ చెందారు. అయితే ప్రభాస్ కి సంబంధించిన ఒక సపరేట్ టీజర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ అలా చేశారంటూ తరువాత కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఆ టీజర్ రిలీజ్ కి టైం వచ్చినట్లు తెలుస్తుంది. సలార్ మూవీ టీం తమ సోషల్ మీడియా అకౌంట్ లో.. “సింహం, చిరుత, పులిని మీరు చూశారు. ఇప్పుడు డైనోసార్ వచ్చే సమయం అయ్యింది. సలార్ వస్తున్నాడు” అంటూ పోస్ట్ చేశారు.

Vaishnavi Chaitanya : అదిరిపోయే ఆఫర్‌ అందుకున్న బేబీ.. ఏకంగా సూపర్ హిట్ సీక్వెల్‌లో హీరోయిన్‌గా..

ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఆగష్టు 15న ప్రభాస్ కి సంబంధించిన టీజర్ లేదా గ్లింప్స్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), జగపతిబాబు ఈ సినిమాలో విలన్స్ గా నటిస్తుంటే టిన్ను ఆనంద్, ఈశ్వరి రావు, సప్తగిరి, శ్రియ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాని 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.