Chiranjeevi: మెగాస్టార్‌తో సినిమా ప్లాన్ చేస్తోన్న స్టార్ కొరియోగ్రఫర్.. వర్కవుట్ అయ్యేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి తనదైన మార్క్ సక్సెస్ అందుకోవడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

Chiranjeevi: మెగాస్టార్‌తో సినిమా ప్లాన్ చేస్తోన్న స్టార్ కొరియోగ్రఫర్.. వర్కవుట్ అయ్యేనా..?

Prabhudeva To Direct Movie With Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి తనదైన మార్క్ సక్సెస్ అందుకోవడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

Chiranjeevi: సంక్రాంతికి మెగాస్టార్ డబుల్ ట్రీట్.. ఎక్కడ చూసినా చిరంజీవే!

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ శరవేగంగా జరుపుతుండగా, చిరంజీవి నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసేందుకు ఓ స్టార్ కొరియోగ్రఫర్ కమ్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ కొరియోగ్రఫర్ ప్రభుదేవా ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి ఓ కథను వినిపించాడని.. అది నచ్చిన చిరు, ఈ ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్‌లో 2007లో ‘శంకర్‌దాదా జిందాబాద్’ మూవీ వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Chiranjeevi : వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ కి స్పెషల్ న్యూ ఇయర్ పార్టీ ఇచ్చిన మెగాస్టార్..

మరి నిజంగానే మరోసారి ప్రభుదేవా డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా రాబోతుందా అనే విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్’ మూవీ తరువాత పట్టాలెక్కించేందుకు ప్రభుదేవా ప్లాన్ చేస్తున్నాడట.