Krishnavamshi : ప్రకాశ్ రాజ్ డైరెక్ట్ చేయాల్సిన సినిమా నాకు ఇచ్చాడు..

ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. ''రంగ మార్తాండ సినిమా నేను చేయాలనుకున్నది కాదు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్‌’ రీమేక్‌లో యాక్ట్ చేస్తూ డైరెక్ట్‌ చేయాలనుకున్నాడు ప్రకాశ్‌రాజ్‌. ఒకరోజు నన్ను కలిసి.............

Krishnavamshi : ప్రకాశ్ రాజ్ డైరెక్ట్ చేయాల్సిన సినిమా నాకు ఇచ్చాడు..

Rangamarthanda

Krishnavamshi :   డైరెక్టర్ కృష్ణవంశీ ఒకప్పుడు చాలా చాలా మంచి సినిమాలతో హిట్స్ కొట్టి ప్రేక్షకులని మెప్పించాడు. గత కొన్నేళ్లుగా ఆ రేంజ్ హిట్స్ కొట్టకపోయినా సినిమాలకి చాలా గ్యాప్ వస్తుంది. కృష్ణవంశీ నుంచి చివరిసారిగా 2017లో నక్షత్రం సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పటికే అయిదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరాఠి సినిమా నటసామ్రాట్ కి రీమేక్ గా రంగమార్తాండని తెరకెక్కిస్తున్నాడు కృష్ణ వంశీ. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్.. ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Salaar: యాక్షన్‌తోనే క్లూ ఇస్తోన్న సలార్.. మీకు అర్థమవుతోందా..?

ఈ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ.. ”రంగ మార్తాండ సినిమా నేను చేయాలనుకున్నది కాదు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్‌’ రీమేక్‌లో యాక్ట్ చేస్తూ డైరెక్ట్‌ చేయాలనుకున్నాడు ప్రకాశ్‌రాజ్‌. ఒకరోజు నన్ను కలిసి ఈ సినిమాని రీమేక్‌ చేయాలి అనుకుంటున్నాను. నాకు స్క్రీన్‌ ప్లేలో సహాయం చెయ్యి అని అడిగాడు. ఆ తర్వాత నట సామ్రాట్ సినిమా చూసి చాలా చోట్ల ఏడ్చేశాను. సినిమా చూసిన తర్వాత ఇది ఎక్స్‌ట్రార్డినరీ సినిమా, రీమేక్‌ చెయ్, ఇందులో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను అని అన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రకాశ్ రాజ్.. నేను డైరెక్ట్‌ చేస్తూ యాక్ట్‌ చేయడం కంటే కూడా నువ్వు ఎమోషన్స్‌ని అద్భుతంగా డీల్‌ చేస్తావు, నన్ను కూడా బాగా డీల్‌ చేస్తావు. ఈ సినిమాని నువ్వే డైరెక్ట్ చెయ్యి అని అన్నాడు. నేను వెంటనే సరే అన్నాను. అలా ప్రకాశ్ రాజ్ చేయాల్సిన సినిమా ‘రంగమార్తాండ’ నా చేతిలోకి వచ్చింది”అని తెలిపారు.