Salaar: యాక్షన్‌తోనే క్లూ ఇస్తోన్న సలార్.. మీకు అర్థమవుతోందా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయో ప్రత్యేకించి....

Salaar: యాక్షన్‌తోనే క్లూ ఇస్తోన్న సలార్.. మీకు అర్థమవుతోందా..?

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ లాంగ్ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తోంది సలార్ టీమ్.

Salaar: సలార్‌లో రాకింగ్ సర్‌ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

ఈ షెడ్యూల్‌లో ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటికే ఏకంగా ఐదు యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించింది సలార్ టీమ్. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తుండటంతో ఆయనతో ప్రభాస్‌పై కొన్నియాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయట. అయితే ఇంకా ఆయన ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కాకపోయినా.. ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. అంటే ఈ సినిమాలో ఇన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయంటే.. అందులోనూ ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్‌తో తెరకెక్కించాల్సిన యాక్షన్ సీక్వెన్స్ బ్యాలెన్స్ ఉందంటే.. ఈ సినిమా ఎలా రాబోతుందో చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పేసింది.

Salaar: ‘సలార్’లో ప్రభాస్ డబుల్ సర్‌ప్రైజ్..?

సలార్ చిత్రాన్ని ఒకటి కాదు.. రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రభాస్‌తో ఇంతటి యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసి, వాటిని సినిమా స్క్రిప్టులో ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ పర్ఫెక్ట్‌గా ప్లేస్ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్‌తో చేసే యాక్షన్ సీన్స్‌ను సలార్ రెండో భాగంలో చూపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ ఖాయం. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్, కేజీయఫ్ 2 చిత్రాలు ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి అలాంటి స్ట్రాటెజీతో ప్రశాంత్ నీల్ సైలెంట్‌గా క్లూ ఇస్తుండటంతో కొంతమంది సినిమా వాళ్లకు మాత్రమే ఈ విషయం అర్థమవుతోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి సలార్ విషయంలో ఏం జరుగుతుంతో మీకు అర్థమవుతోందా..?