Pranitha Subhash : తల్లి కాబోతున్న హీరోయిన్.. దేవుడి బహుమతి అంటూ అధికారికంగా పోస్ట్..

కరోనా టైంలోనే కన్నడ వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ప్రణీత వివాహం అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో జరిగింది. ప్రేమ వివాహం అంటూ వీరి పెళ్లి ఫోటోలని తన సోషల్ మీడియా .........

Pranitha Subhash : తల్లి కాబోతున్న హీరోయిన్.. దేవుడి బహుమతి అంటూ అధికారికంగా పోస్ట్..

Pranitha

Pranitha Subhash :  ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ ప్రణీత. తర్వాత బావ, రభస, డైనమైట్ లాంటి పలు తెలుగు సినిమాల్లో నటించింది. పవన్‌ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాతో తెలుగులో బాగా పాపులర్ అయింది. హీరోయిన్ గానే కాక సామాజిక కార్యకర్తగా కూడా ప్రణీత అంటే చాలామందికి ఇష్టం. కరోనా సమయంలో కర్ణాటకలో అనేక సేవా కార్యక్రమాలు చేసింది ప్రణీత. అభిమానాలు, నెటిజన్లు ప్రణీత సేవా కార్యక్రమాలని చూసి అభినందించారు.

కరోనా టైంలోనే కన్నడ వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ప్రణీత వివాహం అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో జరిగింది. ప్రేమ వివాహం అంటూ వీరి పెళ్లి ఫోటోలని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. తాజాగా తాను తల్లి కాబోతున్నట్టు తెలియచేసింది ప్రణీత. తన భర్త ఆమెని ఎత్తుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో ప్రెగ్నెన్సీ కిట్, స్కానింగ్ కి సంబంధించిన ఫొటోలు పట్టుకొని ఉంది ప్రణీత.

Beast : జోరుగా హుషారుగా.. కారులో బీస్ట్ ప్రమోషన్స్..

భర్తతో కలిసి ఉన్న ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. ”నా భర్త34వ పుట్టినరోజున దేవుడు మాకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు” అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసి అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటీవలే హిందీలో రెండు సినిమాల్లో నటించిన ప్రణీత ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తుంది.