షర్మిల పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. రూపకర్త బ్రదర్ అనీల్.. వెనుక ఉన్నదెవరు?

షర్మిల పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. రూపకర్త బ్రదర్ అనీల్.. వెనుక ఉన్నదెవరు?

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు కారణం అవుతుండగా.. లోటస్ పాండ్‌లో వైయస్ ఆత్మీయులతో, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ,త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రకటించిన తర్వాత ఒక్కొక్కటిగా షర్మిల వెనుక ఎవరు ఉన్నారనే వియమైన క్లారిటీ వస్తోంది.

షర్మిల రాజకీయ పార్టీని పెట్టాలనే నిర్ణయం వెనుక పెద్ద ప్రణాళిక ఉందని, పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అని పార్టీ రూపకర్త బ్రదర్ అనీల్ అనే అభిప్రాయం ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తూ ఉంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాగించడం కోసం వైఎస్ సన్నిహితులు కేవీపీ, సూర్యుడు ఆమె వెనుక నడుస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు.

షర్మిల పార్టీ రూపకర్త అనిల్ కుమార్ కాగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలకంగా పని చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో షర్మిల కోసం పనిచేయనున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రస్తుతం రాష్ట్రంలో కాస్త వ్యతిరేకత ఉందని, రాజశేఖర్ రెడ్డి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీతో ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది.

లోటస్ పాండ్‌లో జరిగిన తొలి సమావేశం కూడా బ్రదర్ అనీల్ సారధ్యంలోనే జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. అక్కడి ఎన్నికల తర్వాత షర్మిల వెనక ఉండి నడిపిస్తారని అంటున్నారు. షర్మిల వెనుక మాత్రం ప్రస్తుతానికి ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నట్లుగా వారి సన్నిహితులే చెబుతున్నారు. తాజా పరిణామాలతో రాబోయే రోజుల్లో షర్మిల చేయబోయే రాజకీయం ఎలా ఉండనుంది అనే ఆసక్తి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.