Prashant Kishore : కాంగ్రెస్ కు పీకే, టీఆర్ఎస్ కు ఐపాక్ !

పీకే టీమ్ టీఆర్ఎస్ కోసం పనిచేస్తుండటంపై కాంగ్రెస్ నేతలు అయోమయంలో ఉన్నారు. మన శత్రువుతో స్నేహం చేసే వారిని ఎప్పుడూ నమ్మవద్దు..? ఇది సరైనదేనా అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్ చేశారు.

Prashant Kishore  : కాంగ్రెస్ కు పీకే, టీఆర్ఎస్ కు ఐపాక్ !

Prashant Kishore

Prashant Kishore : రాజకీయ పార్టీల కోసం ప్రశాంత్ కిషోర్, ఐపాక్ టీమ్ వేరు వేరుగా పనిచేయనున్నాయి. సోనియాగాంధీ నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ లో పీకే చేరికపై స్పష్టత రానున్నది. పీకే వేరు..ఐపాక్ వేరు అనే దిశగా రాజకీయ పార్టీలకు పీకే సంకేతాలిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరికకు ముందే ఇతర తన ఐపాక్ టీమ్ పనిచేసే రాజకీయ పార్టీల అధినేతలను కలిసి ఎన్నికల వ్యూహాలపై పీకే స్పష్టత ఇస్తున్నారు.

పీకే టీమ్ టీఆర్ఎస్ కోసం పనిచేస్తుండటంపై కాంగ్రెస్ నేతలు అయోమయంలో ఉన్నారు. మన శత్రువుతో స్నేహం చేసే వారిని ఎప్పుడూ నమ్మవద్దు..? ఇది సరైనదేనా అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్ చేశారు. శని, ఆది వారాల్లో కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఐపాక్ బృందం చేసిన సర్వేల వివరాలు, ఎన్నికల వ్యూహాలను కేసీఆర్ కు తెలిపారు.

TRS-PK : సీఎం కేసీఆర్ కు పీకే ఇచ్చిన రిపోర్టుతో గులాబీ నేతల్లో టెన్షన్..ఎవరిని ‘పీకే‘స్తారోనని

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారానికి ఐ-ప్యాక్‌తో టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నది. 2023 ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC)తో ఒప్పందం కుదుర్చుకుందని కేటీఆర్ ధృవీకరించింది. I-PAC అధికారికంగా తమ కోసం పని చేస్తోందన్నారు. ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేయడం లేదు., కానీ ఐ-పీఏసీతో కలిసి పనిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.