Masooda: మసూద సక్సెస్‌తో ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మసూద’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. హార్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. రెండు వారాలు ముగిసే సరికి ఈ సినిమాకు ప్రేక్షకాదరణ పెరిగిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Masooda: మసూద సక్సెస్‌తో ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!

Prequel Plans Of Masooda After Getting Huge Success

Masooda: సినిమాలో ఆకట్టుకునే కంటెంట్ ఉంటే స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ఆ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇటీవల సినిమాలకు వచ్చే రిజల్ట్ మనకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మసూద’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. హార్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. రెండు వారాలు ముగిసే సరికి ఈ సినిమాకు ప్రేక్షకాదరణ పెరిగిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Masooda Movie: సైలెంట్ హిట్‌గా దూసుకుపోతున్న ‘మసూద’.. ఆగనంటోందిగా!

ఇక ఈ సినిమాను మేకర్స్ కేవలం రూ.1.5 కోట్ల టార్గెట్‌తో రిలీజ్ చేయగా, రెండు వారాల్లో ఈ సినిమా ఏకంగా రూ.5 కోట్ల మేర వసూళ్లు సాధించినట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి. దీంతో ఈ సినిమా రూ.3.5 కోట్ల ప్రాఫిట్‌తో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇంకా పలు థియేటర్స్, మల్టీప్లెక్స్‌లలో మంచి అక్యుపెన్సీతో రన్ అవుతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమా అందుకున్న సర్‌ప్రైజ్ సక్సెస్‌తో చిత్ర మేకర్స్ ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట.

Masooda Teaser : భయపెడుతున్న ‘మాసూద’ టీజర్.. నాని చేతుల మీదుగా రిలీజ్..

మసూద కథకు ముందుగా ఏం జరుగుతుందనే విషయాన్ని మనకు ప్రీక్వెల్ సినిమాలో చూపంచనున్నారట. ఈ హార్రర్ డ్రామా మూవీలో సంగీత, తిరువీర్, బాంధవి, కావ్య కళ్యాణ్ రామ్, సత్యం రాజేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను సాయి కిరణ్ డైరెక్ట్ చేయగా, నక్కా రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.