Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.. అర్హులెవరు

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్థానాల్లో కొత్త వ్యక్తులు రానున్నారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. జూలై 18న జరగనున్న ఎన్నికల కౌంటింగ్, జూలై 21న ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు.

Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.. అర్హులెవరు

President

Presidential Election 2022: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్థానాల్లో కొత్త వ్యక్తులు రానున్నారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. జూలై 18న జరగనున్న ఎన్నికల కౌంటింగ్, జూలై 21న ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు.

రాష్ట్రపతి పదవికి అర్హులెవరు
రాజ్యాంగంలోని ఆర్టికల్-58 ప్రకారం.. పోటీ చేసే అభ్యర్థులకు ఈ కింద అర్హతలుండాలి.

* 35సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులై ఉండాలి.
* లోక్‌సభకు ఎన్నికయ్యే అర్హతలుండాలి.
* కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదా వాటి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థల్లో లాభదాయక పదవుల్లో ఉండకూడదు.

నామినేషన్ విధానం
రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థిని 50మంది ఎలక్టోరల్ సభ్యులు ప్రతిపాదించాలి. ఆ తర్వాత 50మంది ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పించి డిపాజిట్ కింద రూ.15వేలు కట్టాలి.

Read Also: ప్రెసిడెన్షియల్ ఎన్నిక ప్రక్రియ.. ఎంపీలు, ఎమ్మెల్యేల పాత్ర ఏంటి?