Sunny Leone: సన్నీ లియోన్‌కు మధ్యప్రదేశ్ మంత్రి వార్నింగ్.. మూడ్రోజులే గడువు

మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. బాలీవుడ్ స్టార్ యాక్టరస్ సన్నీ లియోన్, మ్యూజిక్ కంపోజర్ సాఖిబ్ తోషిపై చాలా సీరియస్ అయ్యారు. మూడు రోజులు గడువిస్తూ మధుబన్ మే రాధికా నాచె..

Sunny Leone: సన్నీ లియోన్‌కు మధ్యప్రదేశ్ మంత్రి వార్నింగ్.. మూడ్రోజులే గడువు

Sunny Leone

Updated On : December 26, 2021 / 6:15 PM IST

Sunny Leone: మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. బాలీవుడ్ స్టార్ యాక్టరస్ సన్నీ లియోన్, మ్యూజిక్ కంపోజర్ సాఖిబ్ తోషిపై చాలా సీరియస్ అయ్యారు. మూడు రోజులు గడువిస్తూ మధుబన్ మే రాధికా నాచె సాంగ్ తొలగించాలంటూ డిమాండ్ చేశారు. 1960ల నాటి కోహినూర్ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన పాటకు మార్పులు చేసి రూపొందించిన పాటను మూడ్రోజుల్లోగా తీసేయాలని హెచ్చరించారు.

కొందరు వ్యక్తులు నిరంతరంగా హిందువుల సెంటిమెంట్లను హర్ట్ చేస్తూ ఉన్నారు. కృష్ణ భగవాన్ భార్య రాధను గుడిలో ఉంచి పూజిస్తుంటాం. సాఖిబ్ తోషి అతని మతానికి సంబంధించిన పాటలు చేసుకోవచ్చు కదా. ఇటువంటి పాటలు మాకు ఇబ్బందిగా ఉన్నాయి. న్యాయపరమైన సలహా తీసుకుని పాటను మూడ్రోజుల్లో తొలగించకపోతే తగిన యాక్షన్ తీసుకుంటా’ అని నరోత్తమ్ మిశ్రా అన్నారు.

ఈ పాటపై గొంతెత్తింది మధ్యప్రదేశ్ మంత్రి మిశ్రా మాత్రమే కాదు. హిందూ అర్చకులు సైతం కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడతామని అంటున్నారు. సన్నీలియోన్ నటిగా రూపొందించిన సాంగ్ తో పాటు ఆల్బమ్ ను నిషేదించాలంటూ కోరుతున్నారు.

rEAD aLSO : 12 దేశాల్లో ‘రాధేశ్యామ్’ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్

సన్నీలియోన్ ఈ మధ్య నటించిన ‘మధుబన్‌ మే రాధిక నాచే’ వీడియో ఆల్బమ్‌ విడుదలైంది. డిసెంబర్ 22న విడుదల చేసిన ఈ సాంగ్ లో సన్నీ హాట్‌ హాట్‌గా పర్ఫామెన్స్‌ ఇచ్చింది. పాట కూడా వ్యూస్ పరంగా దూసుకెళ్తుంది. కాగా, ఉత్తర ప్రదేశ్‌లోని ప్రవిత్ర స్థలాల్లో ఒకటైన ‘మధుర’కు చెందిన పూజారులు ఆ పాటపై అభ్యంతరం వ‍్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆల్బమ్‌ను నిషేధించాలని మండిపడుతున్నారు. ఈ పాటలో సన్నీ లియోన్‌ చేసిన అశ్లీల నృత్యం తమ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. సన్నీపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆల్బమ్‌ను నిషేధించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.