Radheshyam : 12 దేశాల్లో ‘రాధేశ్యామ్’ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్

'రాధేశ్యామ్' డైరెక్టర్ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ గురించి తెలిపాడు. రాధాకృష్ణ మాట్లాడుతూ.. ''పద్దెనిమిదేళ్ల కిందట విన్న ఈ కథ నాలో.........

Radheshyam : 12 దేశాల్లో ‘రాధేశ్యామ్’ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్

Radheshyam Visual Effects

Radheshyam :  ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాధేశ్యామ్’. ‘సాహో’ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ చూసి హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని అంతా ప్రశంశిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. తాజాగా ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు చిత్ర బృందం. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా టెక్నీకల్ టీం మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ గురించి తెలిపాడు.

RadheShyam : ‘రాధేశ్యామ్’ 2022 లోనే రిలీజ్ అవుతుందని నాలుగేళ్ళ క్రితమే చెప్పారు

రాధాకృష్ణ మాట్లాడుతూ.. ”పద్దెనిమిదేళ్ల కిందట విన్న ఈ కథ నాలో ఆలోచనని రేకెత్తించింది. వేల ఏళ్లుగా ఉన్న ఓ ప్రశ్న ఇది. అయితే ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్పట్లేదు. ఆ ప్రశ్నకి నా ఆలోచనలు కలిపి తెరపైన వివరణగా ‘రాధేశ్యామ్’ రూపంలో ఇస్తున్నాను. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత కీలకం. ట్రైలర్ చుసిన వాళ్లంతా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయని అంటున్నారు. ట్రైలర్ లో కొన్ని సెకండ్స్ మాత్రమే చూపించాము. సినిమా మొత్తానికి కావాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ 12 దేశాల్లో జరుగుతుంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ హెడ్ కమల్‌కన్నన్‌, ఆయన టీం ఆధ్వర్యంలో ఈ విజువల్ ఎఫెక్ట్స్ రూపు దిద్దుకుంటున్నాయి. వీటి క్రెడిట్ కమల్ కన్నన్ తో పాటు ఆయన బృందానికే దక్కుతుంది” అని అన్నారు. రాధాకృష్ణ చెప్పిన మాటలతో ప్రేక్షకులు ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి ఊహించుకుంటున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమా కచ్చితంగా ఇండియన్ సినిమాలో మరో కొత్త అధ్యాయం సృష్టిస్తుందని తెలుస్తుంది.