PM Modi: అధికారమే లక్ష్యంగా పనిచేయాలి.. తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని దిశానిర్దేశం

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మోదీ సూచించారు. నాయకులు నియోజకవర్గంలోనే ఉండాలని, క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని మోదీ అన్నారు.

PM Modi: అధికారమే లక్ష్యంగా పనిచేయాలి.. తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని దిశానిర్దేశం

Pm Modi (6)

PM Modi: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో రెండు రోజులు పాటు జరిగాయి. శనివారం మొదలైన సమావేశాలు ఆదివారం సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ స్థాయి నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సమావేశాల్లో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

PM Modi: తెలంగాణ వంటకాలను రుచి చూసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని మోదీ సూచించారు. నాయకులు నియోజకవర్గంలోనే ఉండాలని, క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని మోదీ అన్నారు. బూత్ లెవల్ నుంచి బలమైన కార్యకర్తలను ఏర్పరుచుకోవాలని, తద్వారా అధికారమే లక్ష్యంగా పనిచేయాలని మోదీ తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలోకి చేరికలను ప్రోత్సహించాలని, ప్రజాబలమున్న నేతలను గుర్తించి వారిని పార్టీలోకి ఆహ్వానించాలని ప్రధాని సూచించారు. తెలంగాణ నుంచే బీజేపీ ఆపరేషన్ దక్షిణ్ అమలు కావాలని, ఆపరేషన్ దక్షిణ పేరుతో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని రాష్ట్ర పార్టీనేతలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఇదిలాఉంటే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేసినందుకు రాష్ట్ర నాయకత్వాన్ని మోదీ అభినందించారు.

ఇదిలాఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, మరికాసేపట్లో హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతున్నానంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, ప్రారంభించిన సంక్షేమ పథకాలు సమాజంలోని అన్ని వర్గాలు లబ్ధి పొందాయని మోడీ పేర్కొన్నారు. కేంద్ర పథకాలతో రైతులు, యువకులు, మహిళలు ముఖ్యంగా అణగారిన వర్గాలకు మేలు జరిగిందని ప్రధాని మోడీ తెలిపారు.