Project K: బిగ్ స్టార్ క్యాస్టింగ్‌తో ప్రాజెక్ట్ కే.. పెరిగిపోతున్న అంచనాలు!

తెలుగులో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారు ప్రభాస్. రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న పాన్ ఇండియా స్టార్ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు..

Project K: బిగ్ స్టార్ క్యాస్టింగ్‌తో ప్రాజెక్ట్ కే.. పెరిగిపోతున్న అంచనాలు!

Project K

Project K: తెలుగులో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారు ప్రభాస్. రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న పాన్ ఇండియా స్టార్ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.. రోజు రోజుకీ ప్రాజెక్ట్ కే మీద అంచనాలు పెంచేస్తున్నారు నాగశ్విన్.. ఇంతకీ ప్రాజెక్ట్ కే రేంజ్ ని ఎలా పెంచుతున్నారు? ఈ సినిమాను ఎక్కడ షూట్ చేస్తున్నారు? ఇలాంటి ఫుల్ డిటైల్స్ స్టోరీలో చూద్దాం.

Project K: రూమర్స్‌కు చెక్.. ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో ప్రభాస్!

ప్రాజెక్ట్ కె సినిమాలో స్టార్ క్యాస్టింగ్ రోజు రోజుకీ పెంచేస్తున్నారు నాగశ్విన్.. ఈ సినిమాతో బిగ్ బి అమితాబ్ తో నటించాలన్న డ్రీమ్ ఫుల్ ఫిల్ అయ్యిందని హాపీ ఫీలయ్యాడు ప్రభాస్.. దాంతో అమితాబచ్చన్ ప్రాజెక్ట్ కేలో మేజర్ రోల్ చేస్తున్నట్టు ఖరారయింది.. ఇంకా డార్లింగ్ సరసన మరో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ గా మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని కూడా ప్రాజెక్ట్ కే లో నటిస్తున్నట్టు తన ఇన్స్టా పోస్ట్ ద్వారా రివీల్ చేసింది.

Project K: మీలో ఆ ట్యాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో బంపరాఫర్!

ఇలా బిగ్ స్టార్ క్యాస్టింగ్ తో పాటు అప్ కమింగ్ ఆర్టిస్ట్ లను భారీ సంఖ్యలో ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు.. మేకింగ్ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా లార్జ్ స్కేల్ లో ప్రాజెక్ట్ కేను తెరకెక్కిస్తున్నారు నాగశ్విన్. 500 కోట్లకు పైగా మెగా బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్నారు అశ్వినీదత్.. దానికి తగ్గట్టుగానే హాలీవుడ్ రేంజ్ లో సినిమాను రూపొందిస్తున్నారు నాగశ్విన్.

Project K : ప్రభాస్ సినిమా కోసం రంగంలోకి ఆనంద్ మహేంద్ర.. నాగ్ అశ్విన్ ట్వీట్‌కి రిప్లై..

ముందుగా రామోజీ ఫిలిం సిటీలో ట్రయల్ షూట్ కూడా చేసి, ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ నెల 2 నుంచి ప్రాజెక్ట్ కే మేజర్ పార్ట్ హైదరాబాద్ లో తోట తరణి వేసిన భారీ సెట్స్ లో షూట్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో అమితాబ్, దీపిక, దిశా పఠాని లాంటి బిగ్ స్టార్ క్యాస్టింగ్ తో గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు.

Project K: హెల్ప్ ప్లీజ్ అంటూ హైప్ పెంచిన అశ్విన్.. అసలేంటి ప్రాజెక్ట్ కె?

రాధేశ్యామ్ తర్వాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే ఇలా అన్ని భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్న ప్రభాస్ ఈ మూడు సినిమాలపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. నాగశ్విన్ కూడా రోజు రోజుకీ ప్రాజెక్ట్ కే సినిమా స్టార్ క్యాస్టింగ్ పెంచుకుంటూ ఈ సినిమాపైన అంచనాలు భారీ స్తాయిలో పెంచేస్తున్నారు.. ఈ సినిమాను 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అది బాహుబలి 2 రిలీజ్ డేట్.. అంటే, మళ్లీ ప్రభాస్ ఈ సినిమాలతో బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.