Project K: మీలో ఆ ట్యాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో బంపరాఫర్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవల రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ఆ సినిమా ఫెయిల్యూర్‌తో....

Project K: మీలో ఆ ట్యాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో బంపరాఫర్!

Prabhas Project K Calls For Stunt Crew Auditions

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవల రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ఆ సినిమా ఫెయిల్యూర్‌తో తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమాను రెడీ చేస్తున్న ప్రభాస్, ఆ తరువాత కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే.

ProjectK: లెట్స్ స్టార్ట్.. రంగంలోకి దిగిన మహీంద్రా ఇంజనీర్స్!

అయితే ఈ సినిమాలతో పాటు మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీని కూడా పట్టాలెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడ అవుతోంది. అయితే ఈ సినిమాలో ఎక్కువగా కొత్తవారికి ఛాన్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు క్యాస్ట్ కాలింగ్ అంటూ ఆడిషన్స్‌కు పిలుపునిచ్చిన ప్రాజెక్ట్ K.. మరోసారి ట్యాలెంట్ ఉన్నవారిని తమ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే ఈసారి మార్షల్ ఆర్ట్స్, కళరి వంటి స్టంట్స్ తెలిసిన వారికి ప్రాధాన్యతను ఇచ్చింది ప్రాజెక్ట్ K టీమ్.

ProjectK: అందరికీ ఇదే డ్రీమ్ ప్రాజెక్ట్.. ట్వీట్స్ తో అట్రాక్ట్ చేసిన స్టార్స్!

మీలో యాక్షన్ కొరియోగ్రఫీకి కావాల్సిన ట్యాలెంట్ ఉంటే వెంటనే ప్రాజెక్ట్ K టీమ్‌ను సంప్రదించాలని ప్రాజెక్ట్ K మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇలా ఈ సినిమాలో మెజారిటీ క్యాస్టింగ్ భారతీయులే ఉండేలా చిత్ర యూనిట్ చూస్తోంది. ఇక ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తుండగా, నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.