ProjectK: లెట్స్ స్టార్ట్.. రంగంలోకి దిగిన మహీంద్రా ఇంజనీర్స్!

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను నాగ్ అశ్విన్..

ProjectK: లెట్స్ స్టార్ట్.. రంగంలోకి దిగిన మహీంద్రా ఇంజనీర్స్!

Projectk

ProjectK: మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా.. మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టిన యూనిట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది.

ProjectK: అందరికీ ఇదే డ్రీమ్ ప్రాజెక్ట్.. ట్వీట్స్ తో అట్రాక్ట్ చేసిన స్టార్స్!

కాగా, ఈ ప్రాజెక్ట్ కె కోసం ఆనంద్ మహీంద్రను సహాయం కోసం అడిగాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మించి, ఎంతో అధునాతనమైన, విభిన్నమైన వాహనాలను ఈ సినిమా కోసం మేము రూపొందిస్తున్నామని సాయం కావాలని కోరాడు. దీనికి ఆనంద్ మహీంద్రా కూడా స్పందించి.. ఇంత అద్బుతమైన అవకాశాన్ని ఎలా వదులుకుంటామని గ్లోబల్ ప్రొడెక్ట్ డెవలప్‌మెంట్ ఛీఫ్ వేలు మహీంద్రతో అటాచ్ చేశారు. కాగా ఇప్పుడు మహీంద్రా ఇంజనీర్స్ ప్రాజెక్ట్ కె కోసం రంగంలోకి దిగారట.

Project K: హెల్ప్ ప్లీజ్ అంటూ హైప్ పెంచిన అశ్విన్.. అసలేంటి ప్రాజెక్ట్ కె?

నాగ్ అశ్విన్ సోమవారం చెన్నైలోని వేలు మహీంద్రాతో సమావేశమై మాట మంతి జరిపి ప్రాజెక్ట్ -కె వివరాలు అందించారట. వేలు మహీంద్రతో కలిసి మహీంద్ర రీసోర్చ్ వ్యాలీని సందర్శించిన నాగ్ అశ్విన్ ఆ క్షణాల్ని గుర్తు చేసుకుంటూ నాగ్ అశ్విన్ ఓ ట్వీట్ చేశారు. అవకాశం కల్పించిన ఆనంద్ మహీంద్రకి కృతజ్ఞతలు తెలిపారు. అలా మొత్తానికి మహీంద్ర గ్రూప్ తో `ప్రాజెక్ట్ -కె` ప్రయాణం అధికారికంగా నేటి నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే ప్రాజెక్ట్ కె షూటింగ్ కూడా మొదలు కాగా.. మరోవైపు మహీంద్రా ఇంజనీర్స్ కూడా అత్యాధునిక టెక్నాలజీ వాహనాలను అందించే పని స్టార్ చేసినట్లే కనిపిస్తుంది.