IND vs SA: అతి త్వరలో పూజారాకు రెస్ట్ ఖాయం

మిడిలార్డర్ లో ఆడే విరాట్ కోహ్లీ, అజింకా రహానె, చతేశ్వర్ పూజారా ఫామ్ కోల్పోవడంతో అతి త్వరలోనే బ్యాటింగ్ నుంచి తప్పిస్తారేమోననే అనుమానాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి పూజారా..

IND vs SA: అతి త్వరలో పూజారాకు రెస్ట్ ఖాయం

pujara

IND vs SA: దక్షిణాఫ్రికా వేదికగా తలపడుతున్న టీమిండియా తొలి టెస్టును విజయంతో శుభారంభాన్ని నమోదు చేసుకుంది. అయితే మిడిలార్డర్ లో ఆడే విరాట్ కోహ్లీ, అజింకా రహానె, చతేశ్వర్ పూజారా ఫామ్ కోల్పోవడంతో అతి త్వరలోనే బ్యాటింగ్ నుంచి తప్పిస్తారేమోననే అనుమానాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి పూజారా.. సెంచూరియా టెస్టు మ్యాచ్ లో 0, 16స్కోర్లు నమోదుచేశాడు.

మా బ్యాటింగ్ డిపార్ట్ మెంట్ సరిగా ఆడటం లేదు. కేఎల్ రాహుల్ మీదే ఆశలు పెట్టుకున్నాం. పూర్తిగా అతనిపైనే ఆధారపడి ఉండలేం. కోహ్లీ ఒకసారి పూజారాతో మాట్లాడాలి. సీనియర్ ప్లేయర్ అయి ఉండి సరిగా స్కోరు చేయకపోతే శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్ ను జట్టులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయని తెలియజేయాలంటున్నారు క్రికెటర్ శరణ్‌దీప్ సింగ్.

సెంచూరియన్ వేదికగా విజయాన్ని నమోదు చేసి చరిత్ర క్రియేట్ చేసింది టీమిండియా. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ కైవసం చేసుకుంటుందనే నమ్మకం కనబరుస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఏపీలో కొత్తగా 165 కోవిడ్ కేసులు

‘మన టీం బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగా కనిపిస్తుంది. సిరాజ్, ఇషాంత్ టీమ్ లో మెరుగ్గా కనిపిస్తున్నారు. బుమ్రా లాంటి మాస్టర్ పీస్ తో జట్టు అద్భుతంగా ఉంది. ఇండియా సిరీస్ గెలచుకుంటుంది’

‘టీమ్ చాలా బాగుంది. సిరీస్ గెలవగలమని అనుకుంటున్నాం. దక్షిణాప్రికా బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కాస్త బలహీనంగా కనిపిస్తుంది. క్వింటన్ డికాక్ జట్టులో ఉండకపోవడంతో బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది’ అని చెప్తున్నాడు శరణ్ దీప్ సింగ్.