Puneeth Rajkumar : అదేపనిగా జిమ్ చేస్తున్నారా? పునీత్ గుండెపోటుకు కారణం ఏంటి?

అదేపనిగా జిమ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. కరోనా కారణంగా అందరూ ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. ఫిట్ నెస్ కోసం గంటలకొద్ది కసరత్తులు చేస్తుంటారు. అతిగా వ్యాయామం చేయడం మంచిదేనా?

Puneeth Rajkumar : అదేపనిగా జిమ్ చేస్తున్నారా? పునీత్ గుండెపోటుకు కారణం ఏంటి?

Puneeth Rajkumar : అదేపనిగా జిమ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. ఫిట్ నెస్ కోసం అవసరానికి మించి కసరత్తులు చేస్తుంటారు. అతిగా వ్యాయామం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఫిట్ నెన్ ట్రైనర్లు సైతం హెచ్చరిస్తున్నారు. ఇంతకీ జిమ్ చేస్తే గుండెపోటు వస్తుందా? అలాంటప్పుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణానికి కూడా ఇదే కారణమా? అనే సందేహం వ్యక్తమవుతోంది. పునీత్ ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు ఈ వార్త అన్ని సినీ ఇండ‌స్ట్రీల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ వ‌య‌సు కేవలం 46 ఏళ్లు మాత్ర‌మే. రోజూ వ్యాయ‌మం చేస్తూ చాలా ఫిట్‌గా ఉంటాడు. పైగా ఆయ‌న‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య లేదు. ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్ జిమ్ చేస్తున్న సమయంలో ఇలా గుండెపోటుతో మరణించడమేంటి? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.  ఆయనకు గుండెపోటు రావడానికి గల కారణాలపై స్పష్టత లేదు.
Puneeth Rajkumar : ఫిట్ నెస్‌కు మారు పేరు పునీత్, వర్కౌట్ చేయకపోతే ఆరోజు వృథా

ఈ నేపథ్యంలో అతిగా జిమ్ చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్త ఒకటి వినిపిస్తోంది. ఇప్పుడు పునీత్ మరణానికి కూడా ఇదే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. గ‌తంలో జిమ్ చేస్తూ చ‌నిపోయిన ప్రముఖుల సంఘ‌ట‌న‌లను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వాస్తవానికి జిమ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే పరిస్థితుల్లో జిమ్ చేయరాదు? అనారోగ్య సమస్యలు ఉన్నవారు జిమ్ చేయొచ్చా? లేదా అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Puneeth Rajkumar Don't Gym Without Trainers, May Suffer Cardiac Arrest

వెంటిలేషన్ లేని గదుల్లో వ్యాయామం వద్దు :
వెంటిలేషన్ సరిగా లేకుంటే.. జిమ్‌లో ఎట్టిపరిస్థితుల్లో వ్యాయామం చేయరాదు. చిన్నపాటి రూంల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌, రన్నింగ్‌, జాగింగ్‌ చేయకూడదు. అలా చేయాల్సి వస్తే.. ఆ గదిలో వదిలిన గాలినే తిరిగి తీసుకోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. ఫలితంగా రక్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరుగుతుంది. తద్వారా విపరీతమైన తలనొప్పి వస్తుంది. అంతేకాదు.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మరోవిషయం ఏంటంటే?.. బరువు తగ్గేందుకు చాలామంది జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఉద్యోగులు, మహిళల్లో అధిక బరువు, థైరాయిడ్‌ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు.


కానీ, తొందరగా బరువు తగ్గాలని కొందరు.. వెంటనే ఫిట్ నెస్ సాధించాలని మరికొందరు అదేపనిగా జిమ్ లో కసరత్తులు చేసేస్తుంటారు. అది కూడా ట్రైనర్ల సలహాలు, సూచనలు పాటించకుండా తమకు తోచినట్టుగా జిమ్ లో ఎక్కువ సమయం ఎలాపడితే అలా జిమ్ చేసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫిట్ నెస్ రావడం ఏమోకానీ గుండెపోటు వంటి అకాల మరణాలు సంభవించే ముప్పు ఉందని ఫిట్ నెస్ ట్రైనర్లు సూచిస్తున్నారు. జిమ్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరూ వ్యాయమాలు చేయాలి.. ఎవరూ చేయకూడదో కూడా సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
మందులు వాడుతున్న వారు మాత్రం వైద్యుల సూచనల మేరకే వ్యాయామం చేయాలి. ప్రతి జిమ్‌లో తప్పనిసరిగా మెడికల్‌ అడ్వైజర్‌ను ఉండాలి. సామర్థ్యానికి మించి వ్యాయామం చేయరాదని మొదటగా గుర్తించుకోవాలి. జిమ్‌లో వెంటిలేషన్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అతి బరువైన పరికరాలను ఎత్తొద్దు. వ్యాయామం చేస్తున్నప్పుడు మాస్క్‌లు ధరించకూడదు. కొబ్బరి నీళ్లు, వాటర్‌ బాటిల్‌, టవల్‌, లెమన్‌ వాటర్‌, ఓఆర్‌ఎస్‌ తెచ్చుకోవాలి. వ్యాయామాల కోసం ఉపయోగించే డివైజ్‌ల గురించి తప్పక తెలుసుకోవాలి.  హిమోగ్లోబిన్‌ నార్మల్‌గా ఉన్నప్పుడే వ్యాయామం చేయాలి. కోచ్‌ దగ్గరే వ్యాయామాలు చేసుకోవాలి. వర్కౌట్‌కు ముందు బాదం, కర్జూరం తినొచ్చు. తద్వారా ఆక్సిజన్‌ ఇచ్చే సామర్థ్యాన్ని పెంచుతాయి. వ్యాయామాలు చేసిన తర్వాత పండ్లు, గుడ్డు తీసుకోవడం చేయాలి. అలా చేయడం ద్వారా కండరాల నొప్పులు రాకుండా చూసుకోవచ్చు.
Read Also : Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ చివరి ట్వీట్ ఇదే.. అంతలోనే గుండెపోటు!