Puneeth Rajkumar : ఫిట్ నెస్‌కు మారు పేరు పునీత్, వర్కౌట్ చేయకపోతే ఆరోజు వృథా

కన్నడ కంఠీరవ తనయుడికి నటనను, సింగింగ్‌ను ఎంత ఇష్టపడుతాడో జిమ్ వర్కవుట్స్‌ను అంతకన్నా ఎక్కువగా ఇష్టపడుతారు.

Puneeth Rajkumar : ఫిట్ నెస్‌కు మారు పేరు పునీత్, వర్కౌట్ చేయకపోతే ఆరోజు వృథా

Appu

Puneeth Rajkumar Fitness : దక్షిణ భారత నటుల్లో కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌పుత్‌ ఫిట్‌నెస్‌కు మారుపేరు. కన్నడ కంఠీరవ తనయుడికి నటనను, సింగింగ్‌ను ఎంత ఇష్టపడుతాడో జిమ్ వర్కవుట్స్‌ను అంతకన్నా ఎక్కువగా ఇష్టపడుతారు. ఫిట్‌ నెస్‌ కోసం ప్రాణం పెట్టి మరీ వర్కవుట్స్‌ చేస్తారు. వర్కౌట్ చేయపోతే ఆరోజు వృథా అయినట్టేనని పవర్‌ స్టార్ వ్యాఖ్యానించారు.

Read More : Puneeth Rajkumar: టాలీవుడ్‌తో స్వీట్ మెమొరీస్.. పునీత్ కోసం తారక్ పాట!

ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే పునీత్ రాజ్‌కుమార్ ప్రతిరోజూ కొత్త కొత్త స్టంట్స్‌ చేసేవారు. పుష్-అప్‌ చేసే సమయంలో త్వరగా నేలను తాకాడం పునీత్ రాజ్‌కుమార్‌  ప్రత్యేకత. స్పోర్ట్స్ మెన్స్‌ చేసే కష్టమైన వర్కవుట్స్ ను సైతం పునీత్ సులభంగా చేసేవారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఎక్కువ సమయం ఫిట్‌నెస్‌కే కేటాయించారు పునీత్ రాజ్‌కుమార్. కిల్లర్ బ్యాక్‌ఫ్లిప్ చేసి అందరినీ అబ్బురపరిచారు. షూటింగ్‌ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు వర్కవుట్స్ లో నిమగ్నమయ్యేవారు పునీత్ కుమార్.

Read More : Puneeth Rajkumar : తండ్రి సమాధి దగ్గరే పునీత్‌ రాజ్ కుమార్ అంత్యక్రియలు

వ్యాయామం చేయడం తనకిష్టమని.. తన  అభిమానులు కూడా వ్యామాయం చేసి ఫిట్‌గా ఉండాలని ఎన్నో సార్లు పిలుపునిచ్చారు.  కర్నాటకలో జిమ్‌ సెంటర్లను పెట్టేవారిని పునీత్ కుమార్ ప్రోత్సహించేవారు. జిమ్‌ సెంటర్ ఓపెనింగ్‌కు పిలిస్తే షెడ్యూల్‌ను సైతం పక్కన బెట్టి నిర్వాహకులను ప్రోత్సహించేవారు పునీత్‌. పవర్‌ స్టార్ అంటే సినిమాల్లో మాత్రమే కాదు.. ఫిజికల్‌గా కూడా ఫిట్‌ నెస్‌గా ఉండాలని చెప్పేవారు పునీత్ కుమార్.

Read More : Puneeth Rajkumar: మంచి ఆప్తుడ్ని కోల్పోయాం.. ప్రముఖుల సంతాపం!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. పునీత్ రాజ్‌కుమార్ మృతిని కర్టాటక రెవెన్యూ శాఖ మంత్రి అశోక్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పునీత్ కుటుంబసభ్యుల్నీ కలిసి ఓదార్చారు సీఎం బసవరాజు బొమ్మై. కర్ణాటక వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. సినిమా హాల్స్‌ను మూసేసింది. పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయాన్ని బెంగళూరు, సదాశివనగర్‌లోని నివాసానికి తరలించారు. ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియానికి పునీత్ మృతదేహాన్ని తరలించారు. శనివారం ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి.