Puneeth Rajkumar: మంచి ఆప్తుడ్ని కోల్పోయాం.. ప్రముఖుల సంతాపం!

కన్నడ నటుడు, పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఉదయం జిమ్‌ లో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో..

Puneeth Rajkumar: మంచి ఆప్తుడ్ని కోల్పోయాం.. ప్రముఖుల సంతాపం!

Puneeth Rajkumar (3)

Puneeth Rajkumar: కన్నడ నటుడు, పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఉదయం జిమ్‌ లో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తుండగా తుది శ్వాస విడిచారు. పునీత్ మరణ వార్త తెలియగానే అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని కోల్పోయిన అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. పునీత్ మరణ వార్తపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Puneeth Rajkumar: పవర్ స్టార్ పునీత్ ఇక లేరు..!

వ్యక్తిగతంగా కూడా పునీత్ ఇతర బాషల సినీపరిశ్రమలతో కూడా మంచి సంబంధాల నేపథ్యంలో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పునీత్‌ ఆకస్మిక మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపిన కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై అస్వస్థత గురైన విషయం తెలియగానే ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం తనను షాక్‌కి గురిచేసిందని, చిన్న వయస్సులోనే మనందరినీ వదిలి వెళ్లిపోవడం కలిచివేస్తోందని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అన్నారు.

Puneeth Rajkumar: మిస్ యూ పునీత్.. అభిమానుల కన్నీటి రోదన!

పునీత్ మరణంపై టాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. హృదయం ముక్కలైంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంత త్వరగా మనల్ని వదలి వెళ్లారనే వార్త విస్మయానికి గురి చేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ నటుడు. తన నటనతో కొన్ని లక్షల హృదయాల్ని గెలుచుకున్నారు. అలాంటి ఆయన మరణ వార్త షాక్‌కి గురిచేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ ట్వీట్ చేశారు.

Puneeth Rajkumar : పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు గుండెపోటు.. అభిమానుల్లో ఆందోళన..

దర్శకులు పూరి జగన్నాధ్, మెహర్ రమేష్, దేవాకట్టా, నిర్మాతలు కూడా పునీత్ మృతి కన్నడ పరిశ్రమకి తీరని లోటుగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌గారి కుమారుడు, అద్భుతమైన అభినయం, చాతుర్యం ఉన్న పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇక లేరనే నిజం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని నటి పూజా హెగ్డే ట్వీట్ చేసింది.

Rajinikanth : రజినీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

పునీత్ రాజ్ కుమార్ గారు తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నమ్మశక్యం కాలేదు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పునీత్ లేడనే విషయముల నమ్మలేకపోతున్నామని జూనియర్ ఎన్టీఆర్, పునీత్ ఆత్మకు శాంతి చేకూర్చాలని రవితేజ ట్వీట్ చేశారు. మహేష్ బాబు, రామ్ చరణ్, అడవి శేష్, ప్రకాష్ రాజ్, మంచి విష్ణు, మనోజ్, లక్ష్మి, జగపతి బాబు ఇలా తెలుగు సినీ నటులంతా పునీత్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.