High Court: వారు 16ఏళ్లకే పెళ్లిచేసుకోవచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు..

పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముస్లిం అమ్మాయిలు 16ఏళ్లు నిండితే పెళ్లిచేసుకోవచ్చని పేర్కొంది. సింగిల్ జడ్జి జిస్టిస్ బస్ జిత్‌సింగ్ బేడీ సోమవారం ఈ తీర్పును వెలువరించారు. షరియా లా ప్రకారం ముస్లిం అమ్మాయి 16ఏళ్లకు పెళ్లి చేసుకోవటం సరైనదేనని కోర్టు స్పష్టం చేసింది.

High Court: వారు 16ఏళ్లకే పెళ్లిచేసుకోవచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు..

Marriage

High Court: పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముస్లిం అమ్మాయిలు 16ఏళ్లు నిండితే పెళ్లిచేసుకోవచ్చని పేర్కొంది. సింగిల్ జడ్జి జిస్టిస్ బస్ జిత్‌సింగ్ బేడీ సోమవారం ఈ తీర్పును వెలువరించారు. షరియా లా ప్రకారం ముస్లిం అమ్మాయి 16ఏళ్లకు పెళ్లి చేసుకోవటం సరైనదేనని కోర్టు స్పష్టం చేసింది.

Asaduddin Owaisi: ప్రధాని మోదీకి ఓవైసీ సూచన.. ఆ విషయంపై మీ స్నేహితుడు అబ్బాస్‌ను అడగండి..

కొద్దిరోజుల క్రితం పఠాన్ కోటకు చెందిన 16ఏళ్ల అమ్మాయి, 21ఏళ్ల అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. జూన్8న ఈ జంట ఇస్మామిక్ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే వారిపెళ్లిని కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పాటు బెదిరింపులకు గురిచేశారు. ఈ క్రమంలో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆ జంట కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన జడ్జి జస్టిస్ జిస్జిత్ సింగ్ బేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వారి ప్రాథ‌మిక హ‌క్కుని కాల‌రాయ‌లేమ‌ని తెలిపారు. ఇస్లామిక్ ష‌రియా చ‌ట్టాన్ని త‌న తీర్పులో ప్ర‌స్తావించారు. ముస్లిం అమ్మాయిల‌ పెళ్లిళ్లు ముస్లిం ప‌ర్స‌న‌ల్ చ‌ట్టం ప‌రిధిలోకి వస్తాయని జడ్జి పేర్కొన్నారు.

Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్

ఆర్టిక‌ల్ 195 ప్ర‌కారం ముస్లిం అమ్మాయికి 16 ఏళ్లు నిండాయ‌ని, ఆ రూల్ ప్ర‌కారం ఆమె పెళ్లి చేసుకోవ‌చ్చు. అబ్బాయి వ‌య‌సు 21 ఏళ్లు దాటాక చేసుకోవాలి. ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా కూడా దీన్ని అంగీక‌రిస్తుంద‌ని కోర్టు తెలిపింది. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం యుక్త వయసు వచ్చిన వారు తాము ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. వారిద్దరూ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్న కారణంగా ప్రాథమిక హక్కులను తిరస్కరించలేమని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో వారి వివాహానికి ఆమోదం తెలిపింది.