Punjab Elections 2022 : సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్లీ సొంతగూటికే.. కేవలం 39 రోజుల్లో 3 సార్లు పార్టీ మార్పు..!

కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ కీలక నేత బీజేపీలో చేరారు. హరగోవింద్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ తిరిగి మళ్లీ బీజేపీలో చేారారు.

Punjab Elections 2022 : సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్లీ సొంతగూటికే.. కేవలం 39 రోజుల్లో 3 సార్లు పార్టీ మార్పు..!

Punjab Elections 2022 Balwi

Punjab Assembly Election 2022 : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ కీలక నేత బీజేపీలో చేరారు. గతంలో బీజేపీలో ఉన్న హరగోవింద్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ తిరిగి మళ్లీ సొంతగూటికే చేరారు. బీజేపీతో విడిపోయిన తర్వాత బల్వీందర్ సింగ్ లడ్డీ జనవరి 3న కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్ చేరిన కేవలం 39 రోజుల్లోనే మళ్లీ హస్తాన్ని వీడి కాషాయ కండువ కప్పుకున్నారు.

బటాలాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ బల్వీందర్ లడ్డీని బేజేపీలోకి తిరిగి ఆహ్వానించారు. బటాలా బీజేపీ అభ్యర్థి ఫతేజాంగ్ బజ్వా కూడా పార్టీ చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత పర్తాప్ సింగ్ బజ్వా తమ్ముడు అయిన బజ్వాతో పాటు లడ్డీ డిసెంబరు 28న దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

అయితే, కాషాయ పార్టీలో చేరిన 6 రోజుల తర్వాత, లడ్డీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. పంజాబ్ వ్యవహారాల AICC ఇన్‌ఛార్జ్ హరీష్ చౌదరి, సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సమక్షంలో పంజాబ్ పాలక సంస్థలో తిరిగి చేరారు. గురుదాస్‌పూర్ జిల్లాలోని హరగోవింద్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినందుకు లడ్డీకి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. లడ్డీ స్థానంలో మన్‌దీప్ సింగ్‌ను కాంగ్రెస్ నామినేట్ చేసింది. అసంతృప్తితో ఉన్న లడ్డీ.. పార్టీలో చేసేది ఏమిలేక మళ్లీ సొంత పార్టీలో చేరారు.


కాంగ్రెస్ లో చేరిన ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తిరిగి సొంత పార్టీలోకి చేరక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా పెద్ద తప్పు చేశానంటూ బల్వీందర్ సింగ్ అన్నారు. బీజేపీలోకి తిరిగి రావాలని ఫతే జంగ్ పట్టుబట్టారని తెలిపారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమైనప్పటికీ పార్టీ తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధించిందన్నారు.

అలాంటి పార్టీలో తాను ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతోనే తిరిగి బీజేపీలోకి చేరాలని నిర్ణయించుకున్నట్టు లడ్డీ చెప్పారు. కాంగ్రెస్ లో చేరినప్పటికి తాను కూడా పార్టీ కోసం ఏం చేయలేదని అన్నారు. అందుకే పార్టీ నుంచి విడిపోయానని తెలిపారు.

బీజేపీ జాతీయ పార్టీ సిద్ధాంతాలు తననెంతో ఆకర్షించాయని, అందుకే మళ్లీ బీజేపీలోనే చేరాలని నిశ్చయించుకున్నానని లడ్డీ పేర్కొన్నారు. కాషాయ కండువా కప్పుకున్నానని లడ్డీ తెలిపారు. లడ్డీతో బీజేపీలో క్రికెటర్ దినేష్ మోంగియా కూడా చండీగఢ్‌లో బీజేపీ పార్టీలో చేరారు. గుర్తేజ్ గుధియాన్ కూడా బీజేపీలో చేరారు.

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీలో ఈ నేతలందరికి కాషాయ పార్టీలో సభ్యత్వాన్ని ఇప్పించారు. పంజాబ్ 16వ అసెంబ్లీకి చెందిన 117 మంది సభ్యులను ఎన్నుకునేందుకు 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 20 నుంచి జరుగనున్నాయి. ఓట్లు లెక్కింపుతో పాటు ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడి కానున్నాయి.

Read Also : Hijab Row: మా అంతర్గత వ్యవహారంలో మీరు తలదూర్చకండి: హిజాబ్ పై విదేశాంగశాఖ వివరణ