Pushpa 2: పుష్పరాజ్‌కు లీకుల బెడద.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో బన్నీ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించిన తీరు ఆడియెన్స్‌ను కట్టిపడేసింది. ఈ సినిమాను ఎంత ఎంగేజింగ్‌గా తెరకెక్కించారంటే.. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంతకాలం అయినా, ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారంటే ఈ మూవీ వారికి ఏ రేంజ్‌లో ఎక్కిందో అర్థం చేసుకోవచ్చు.

Pushpa 2: పుష్పరాజ్‌కు లీకుల బెడద.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Pushpa 2 Facing Problems With Leaks

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో బన్నీ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించిన తీరు ఆడియెన్స్‌ను కట్టిపడేసింది. ఈ సినిమాను ఎంత ఎంగేజింగ్‌గా తెరకెక్కించారంటే.. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంతకాలం అయినా, ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారంటే ఈ మూవీ వారికి ఏ రేంజ్‌లో ఎక్కిందో అర్థం చేసుకోవచ్చు.

Pushpa 2 : పుష్ప అప్డేట్ ఇచ్చిన సుకుమార్..

ఇక ఇప్పటికే ఈ సీక్వెల్ పార్ట్‌ను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌లో హీరో అల్లు అర్జున్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అవడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. ఈ లీక్ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండటంతో, అసలు ఈ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయనే ఆరా తీస్తున్నారు చిత్ర యూనిట్.

Pushpa 2 : పుష్ప-2 షూటింగ్ అప్డేట్ వచ్చేసింది..

ఇకపై సెట్స్ నుండి ఎలాంటి ఫోటోలు కూడా లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోండగా, ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న పుష్ప-2 సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.