Jubilihills Rape Case: బాలికపై అత్యాచార ఘటన.. పోలీసులపై రఘనందన్‌రావు ఫైర్

జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో దోషులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Jubilihills Rape Case: బాలికపై అత్యాచార ఘటన.. పోలీసులపై రఘనందన్‌రావు ఫైర్

Raghunandan Rao

Jubilihills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో దోషులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గత నెల 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Elon Musk: టెస్లాలో పది శాతం ఉద్యోగాల కోత అవసరం: ఎలన్ మస్క్

జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను కారులో ఇంటికి తీసుకెళ్తామని నమ్మించిన కొందరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక ఎమ్మెల్యే కుమారుడు, మరో ప్రజా ప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నారు. అత్యాచారం అనంతరం బాలికను సాయంత్రం పబ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక ఫోన్ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక మెడ చుట్టూ గాయాలు గమనించిన తండ్రి విషయం ఆరా తీశాడు. దీంతో బాలిక అత్యాచారం విషయం చెప్పింది. వెంటనే బాలిక కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్లో మైనర్లు ఉన్నారని, వారిలో ఒక ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ఘటన జరిగి ఇన్ని రోజులు కావొస్తున్నా నిందితుల్ని పట్టుకోకపోవడంపై విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ విషయంపై ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులపై ఫైర్ అయ్యారు. ‘‘జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.

BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. వేగంగా ఏర్పాట్లు

దీనిపై సీబీఐ విచారణ జరపాలి. విచారణ పూర్తయ్యే వరకు హోం మంత్రిని తొలగించాలి. సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి. అమ్మాయి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి. న్యాయం కోసం హైకోర్టులో పిల్ వేస్తాం. తెలంగాణలో దృతరాష్ట్రుని పాలన కొనసాగుతోంది. హోం మంత్రి మనవడు ఇచ్చిన బ్యాచిలర్స్ పార్టీ వల్లనే రేప్ ఘటన జరిగింది. ట్విట్టర్ పక్షి, కవిత ఈ విషయంపై ఎందుకు కూయడం లేదు? అమ్మాయిని పబ్‌లోకి ఎలా అనుమతించారో సమాధానం చెప్పాలి. నిందితులపై కాకుండా కారుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సిగ్గు చేటు. పోలీసుల విచారణలో పారదర్శకత లోపించింది. బోధన్ ఎమ్మెల్యే కేసు ఇప్పటికీ అతీగతీ లేదు’’ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.