National Herald case: రెండున్నర‌ గంట‌లు విచారించిన ఈడీ.. సోనియాను చూడడానికి నేరుగా గంగారాం ఆసుప‌త్రికి రాహుల్ గాంధీ

నేష‌న‌ల్ హెరాల్డ్ వార్తాప‌త్రిక‌కు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దాదాపు రెండున్న‌ర గంట‌ల‌పాటు ప్ర‌శ్నించింది. అనంత‌రం, భోజ‌న విరామం స‌మ‌యంలో (మ‌ధ్యాహ్నం 2.10 గంట‌ల‌కు) ఆయ‌న‌ను బ‌య‌ట‌కు పంపింది.

National Herald case: రెండున్నర‌ గంట‌లు విచారించిన ఈడీ.. సోనియాను చూడడానికి నేరుగా గంగారాం ఆసుప‌త్రికి రాహుల్ గాంధీ

Rahul Gandhi

National Herald case: నేష‌న‌ల్ హెరాల్డ్ వార్తాప‌త్రిక‌కు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దాదాపు రెండున్న‌ర గంట‌ల‌పాటు ప్ర‌శ్నించింది. అనంత‌రం, భోజ‌న విరామం స‌మ‌యంలో (మ‌ధ్యాహ్నం 2.10 గంట‌ల‌కు) ఆయ‌న‌ను బ‌య‌ట‌కు పంపింది. నేటి ఈడీ విచార‌ణ పూర్తిగా ముగిసిందా? లేదా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. భోజ‌నం విరామం అనంత‌రం రాహుల్‌ను ఈడీ అధికారులు మ‌ళ్లీ విచారించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

National Herald case: నిర‌స‌న రూపంలో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ఈడీపై కాంగ్రెస్ ఒత్తిడి!: స్మృతీ ఇరానీ

ఇప్ప‌టికే రాహుల్ నుంచి రాబ‌ట్టిన వివ‌రాల‌ను ఈడీ అధికారులు రికార్డు చేసుకున్నారు. మ‌ధ్యాహ్నం 2.10 గంట‌లకు ఈడీ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రాహుల్ గాంధీ అక్క‌డి నుంచి నేరుగా ఢిల్లీలోని గంగారాం ఆసుప‌త్రికి త‌న సోద‌రి ప్రియాంకా గాంధీతో క‌లిసి వెళ్లారు. ఆ ఆసుప‌త్రిలో వారి త‌ల్లి సోనియా గాంధీ చికిత్స తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. క‌రోనా అనంత‌ర స‌మ‌స్య‌ల‌తో సోనియా గాంధీ బాధ‌ప‌డుతున్నారు. కాగా, రాహుల్‌ను ఈడీ విచార‌ణ‌కు పిల‌వ‌డంపై కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.