Rajamouli : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాజమౌళికి కీలక బాధ్యతలు..
బాహుబలి, RRR సినిమాలతో నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి కర్ణాటకలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ప్రస్తుతం ఆస్కార్ బరిలో RRR నాటు నాటు సాంగ్ నిలవడంతో, అమెరికాలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి తిరిగి ఇండియా రాగానే కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా బాధ్యతలు స్వీకరించనున్నాడు.

Rajamouli has appointed to karnataka election icon
Rajamouli : బాహుబలి, RRR సినిమాలతో నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి కర్ణాటకలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ప్రస్తుతం ఆస్కార్ బరిలో RRR నాటు నాటు సాంగ్ నిలవడంతో, అమెరికాలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి తిరిగి ఇండియా రాగానే కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని రాయచూర్ కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ వెల్లడించాడు.
రాజమౌళి పెరిగింది రాజమండ్రి కొవ్వూరులో అయినా పుట్టింది మాత్రం కర్ణాటక రాయచూరు జిల్లాలోని మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపు. కాగా త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికల ప్రచారకర్తలుగా సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను ఎన్నికల సంఘం నియమిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన రాజమౌళిని తన పుట్టిన జిల్లాకి ఎన్నికల ప్రచారకర్తగా (Election Icon) నియమించడానికి కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేశారు. ఇందుకు ఎన్నికల సంఘం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాజమౌళి కూడా ఈ బాధ్యతను స్వీకరించేందుకు అంగీకారం తెలిపాడట. కాగా ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి చేయవల్సిన పనులు ఏంటంటే.. ప్రజల్లో ఓటు హక్కు పై అవగాహన కలిపించి వారిలో చైతన్యం తీసుకు వచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యక్షంగా ప్రచారం చేయడం, వీడియో ద్వారా సందేశాలు ఇవ్వడం వంటివి చేసి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచాల్సి ఉంటుంది. ఇది ఏ పార్టీ కోసం చేసేది కాదు. కేవలం ప్రజలకి తమ ఓటు హక్కుని వినియోగించుకొనే బాధ్యతను తెలియజేయడం. మరి తన సినిమాల్లో ఎమోషన్స్ పండిస్తూ ప్రజల్ని థియేటర్స్ కి రప్పించే రాజమౌళి, తన ప్రచారంతో ప్రజల్ని పోలింగ్ బూత్స్ కూడా రాపిస్తాడా? లేదా? చూడాలి.
కాగా ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 12న జరగనున్నాయి. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం 5:30 గంటల నుంచి మొదలు కానుంది. ఈ కార్యక్రమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడవచ్చు. ఇక దేశంలో అందరి ద్రుష్టి ఇప్పుడు RRR ఆస్కార్ అందుకుంటుందా? లేదా? అనే దాని మీదనే ఉంది. మరి RRR ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టిస్తుందా? లేదా? చూడాలి.