Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా....

Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?

Rajamouli To Bring Bollywood Villain For Mahesh Babu

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో మహేష్ ఊరమాస్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్లు రాబడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్, తన నెక్ట్స్ చిత్రాలను త్రివిక్రమ్, రాజమౌళిలతో తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.

Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!

అయితే మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా రాబోతున్న పాన్ ఇండియా చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తనదైన మార్క్ మూవీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల జక్కన్న కూడా ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో వెకేషన్‌కు వెళ్లి, తాజాగా తిరిగి వచ్చాడు. ఇక ప్రస్తుతం మహేష్ సినిమా కోసం స్క్రిప్టు పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను అడవి నేపథ్యంలో సాగే కథతో తీయబోతున్నాడట జక్కన్న. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను భారీ క్యాస్టింగ్‌తో రూపొందించనున్నాడు. అయితే ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతారంలో చూపించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.

Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?

అటు మహేష్ బాబును ఢీకొనే విలన్ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాలని రాజమౌళి అనుకుంటున్నాడట. అందుకోసం ఈ సినిమాలో విలన్‌గా నటించే యాక్టర్‌ను సౌత్ నుండి కాకుండా బాలీవుడ్ నుండి దించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట. బాలీవుడ్‌లో మంచి ఫేం ఉన్న స్టార్ యాక్టర్‌ను మహేష్ సినిమా కోసం విలన్‌గా తీసుకురాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇంకా ఈ సినిమా స్క్రిప్టు పనులే పూర్తి కాలేదు, అప్పుడే నటీనటుల విషయం సోషల్ మీడియాలో వినిపిస్తుండటంతో ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.