Ram Charan: చెర్రీ హై స్పీడ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెగా ట్రీట్!

రామ్ చరణ్ స్పీడ్ మామూలుగా లేదు. వన్ మంత్ గ్యాప్ లో రెండు భారీ సినిమాలతో రాబోతున్నారు. అటు శంకర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ చేస్తూనే.. జూలై నుంచి మరో సినిమాను సెట్స్ పైకి..

Ram Charan: చెర్రీ హై స్పీడ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెగా ట్రీట్!

Ram Charan

Ram Charan: రామ్ చరణ్ స్పీడ్ మామూలుగా లేదు. వన్ మంత్ గ్యాప్ లో రెండు భారీ సినిమాలతో రాబోతున్నారు. అటు శంకర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ చేస్తూనే.. జూలై నుంచి మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. అంతేనా మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ ను సైతం లైన్ లో ఉంచారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్న చరణ్ మూవీ డైరీపై ఓ లుక్…

Ram Charan : రాజమండ్రిలో రామ్ చరణ్.. RC 15 షూటింగ్..

ఆర్ఆర్ఆర్, ఆచార్య రెండూ.. భారీ మల్టీస్టారర్ సినిమాలే. ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతుంది ఈ వెంటనే ఆచార్య ఏప్రిల్ 29న థియేటర్లోకి రానుంది. ట్రిపుల్ ఆర్, ఆచార్య తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా దిల్ రాజు బ్యానర్ లో శంకర్ సినిమాను పట్టాలెక్కించారు మెగాపవర్ స్టార్. ఇప్పుడీ సినిమా హైస్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఉండొచ్చనే హింట్ కూడా ఇచ్చారు దిల్ రాజు. శంకర్ సినిమా ఇలా లైన్ లో ఉండగానే ఈమధ్యే అఫీషియల్ చేసిన గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ షూటింగ్ లో చరణ్ పాల్గొనబోతున్నారు.

Ram Charan: ముంబై వీధుల్లో రామ్ చరణ్.. ఎందుకు వెళ్లినట్లో?

ప్రస్తుతం చరణ్ సినిమా కోసం జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమా జులై నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో మెరుపు అనే టైటిల్ తో రామ్ చరణ్.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తాడన్న ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. అప్పటినుంచి చరణ్ ని స్పోర్ట్స్ మాన్ గా చూడాలనుకున్న అభిమానులకు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ మంచి కిక్కివ్వబోతుంది.

Ram Charan : మరో డైరెక్టర్ ఇచ్చిన కథతో శంకర్ RC 15..

ట్రిపుల్ ఆర్, ఆచార్య.. శంకర్, గౌతమ్ తిన్ననూరి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఈ నాలుగు సినిమాల తర్వాత కూడా చరణ్ బిజీ షెడ్యూలే ప్లాన్ చేసుకున్నాడు. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నాడు చరణ్. మరోవైపు రంగస్థలం తర్వాత సుకుమార్ – చరణ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా సుకుమార్ ప్రాజెక్ట్ పై చరణ్, రాజమౌళి హింట్ కూడా ఇచ్చారు. ఇవే కాదు వన్స్ ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా వైడ్ రిలీజైతే.. చరణ్ లిస్ట్ లో ఇంకెంతమంది డైరెక్టర్స్ యాడ్ అవుతారో చూడాలి.