Ram Charan : రాజమండ్రిలో రామ్ చరణ్.. RC 15 షూటింగ్..

తాజాగా హీరో రామ్‌చరణ్‌ ముంబై నుంచి రాజమండ్రికి వచ్చారు. రాజమండ్రి విమానాశ్రయంలో రామ్ చరణ్ ని చూసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. నిన్నటి నుంచి RC 15 షూటింగ్.......

Ram Charan :  రాజమండ్రిలో రామ్ చరణ్.. RC 15 షూటింగ్..

Rc 15

Updated On : February 15, 2022 / 7:55 AM IST

RC 15 :  స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు RC 15 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ముంబై, పుణెలలో రెండు షెడ్యూల్స్ షూటింగ్స్ పూర్తయ్యాయి. తాజాగా ఇటీవలే ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది.

మొన్నటిదాకా రామ్ చరణ్ ముంబైలో ఉన్నాడు. రామ్ చరణ్ ముంబై నుంచి వచ్చాక ఈ సినిమా షూటింగ్ మూడో షెడ్యూల్ మొదలు పెడతామనన్నారు. ఈ లోపే డైరెక్టర్ శంకర్ తో సహా శంకర్ టీమ్ లోని కొంతమంది గోదావరి జిల్లాలో ఉన్న దోసకాయల పల్లి అనే గ్రామానికి చేరుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

Valentines Day : ప్రియుడికి వాలెంటైన్స్ డే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనతార

తాజాగా హీరో రామ్‌చరణ్‌ ముంబై నుంచి రాజమండ్రికి వచ్చారు. రాజమండ్రి విమానాశ్రయంలో రామ్ చరణ్ ని చూసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. నిన్నటి నుంచి RC 15 షూటింగ్ మొదలైందని సమాచారం. ఒక పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలని గోదావరి జిల్లాల్లో చిత్రీకరించనున్నారు. దాదాపు 10 రోజులు ఈ షూటింగ్ ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే దిల్ రాజు ప్రకటించారు.