Valentines Day : ప్రియుడికి వాలెంటైన్స్ డే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనతార

తాజాగా ప్రేమికుల రోజును పురస్కరించుకుని నయనతార తన ప్రియుడిని సర్‌ప్రైజ్‌ చేసింది. గతంలో నయన్ బర్త్ డేకి విగ్నేష్ కూడా సర్‌ప్రైజ్‌ చేశాడు. నిన్న వ్యాలెంటైన్స్ డే సందర్భంగా.........

Valentines Day : ప్రియుడికి వాలెంటైన్స్ డే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనతార

Nayantara

Naynathara :  నిన్న వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపంచంలోని ప్రేమికులంతా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకరికొకరు పువ్వులు, గిఫ్టులు ఇచ్చి వారి ప్రేమని తెలియ చేశారు. సెలబ్రిటీలు కూడా వ్యాలెంటైన్స్ డేని గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఒక పక్క గుళ్ళకి, మరో పక్క దుబాయ్ లాంటి వెకేషన్ ప్లేసెస్ కి తిరిగేస్తూ ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వారు ఎంజాయ్ చేసే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా ప్రేమికుల రోజును పురస్కరించుకుని నయనతార తన ప్రియుడిని సర్‌ప్రైజ్‌ చేసింది. గతంలో నయన్ బర్త్ డేకి విగ్నేష్ కూడా సర్‌ప్రైజ్‌ చేశాడు. నిన్న వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ను కలిసి గులాబీల పుష్పగుచ్ఛం అందించింది నయన్. ఆ తర్వాత అతడికి ప్రేమగా కౌగిలి ఇచ్చి హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని చెప్పగా విగ్నేష్ కూడా నయన్ ని హత్తుకొని నుదిటిపై ముద్దు పెట్టుకొని వ్యాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు.

Beast : విజయ్ సినిమా కోసం శివ కార్తికేయన్ పాట

ఇక ఇదంతా వీడియో తీసి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసి.. ”తను వచ్చి పువ్వులు ఇచ్చినప్పుడు ప్రతి సారి మొదటి సారిలానే అనిపిస్తుంది. ఇది తప్పకుండా చాలా సంతోషించే వ్యాలెంటైన్స్ డే” అని పోస్ట్ చేశాడు విగ్నేష్ శివన్.

View this post on Instagram

A post shared by Vignesh Shivan (@wikkiofficial)