ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్.. వన్ అండ్ ఓన్లీ మెగా పవర్ స్టార్..

ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్.. వన్ అండ్ ఓన్లీ మెగా పవర్ స్టార్..

Ram Charan: ఇండియాలో టాప్ డైరెక్టర్‌, మన భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు శంకర్. ‘జెంటిల్‌మెన్’ నుండి ‘రోబో 2.0’ వరకు ఆయన సినిమాలు అన్నీ గుర్తుండిపోయేవే. శంకర్ డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది. ఒక్క ‘స్నేహితుడు’ (త్రీ ఇడియట్స్) రీమేక్ తప్ప మిగతా సినిమాలన్నీ కూడా ప్రేక్షకాదరణ పొందాయి.

ఎప్పటినుండో తెలుగులో డైరెక్ట్ మూవీ చెయ్యాలనుకున్నా, ఆయనతో తెలుగులో సినిమా చేయించాలని మన మేకర్స్ ప్రయత్నాలు జరిపినా కుదర్లేదు. ఎట్టకేలకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శంకర్‌తో తెలుగు సినిమా చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్‌ల క్రేజీ కాంబో సెట్ చేశారు రాజు.

Ram Charan

ఈ సినిమాతో చరణ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. టాలీవుడ్‌లో ఈ జెనరేషన్ హీరోల్లో ఇండియాలోని ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్‌తో పని చేసిన, చేస్తున్న క్రెడిట్ చెర్రీదే కావడం విశేషం.
దర్శక ధీరుడు రాజమౌళితో హీరోగా రెండో సినిమా ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ కొట్టిన రామ్ చరణ్.. ఇప్పుడు మళ్లీ జక్కన్నతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

శంకర్ సినిమాల గురించి ఆయన సినిమాల స్థాయి గురించి ప్రపంచం మొత్తం తెలుసు.. మన ఇండియన్ సినిమాని పాన్ ఇండియా లెవల్‌కి తీసుకెళ్లింది శంకర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అటువంటి శంకర్ మన టాలీవుడ్‌లో యంగ్ స్టార్ హీరో చరణ్‌తో సినిమా చేయనుండడం, అదీ పాన్ ఇండియా రేంజ్ మూవీ కావడం తెలుగు వారికి గర్వకారణం అనే చెప్పాలి.