Acharya: ‘ఆచార్య’లో చరణ్‌ను తగ్గించారా..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పలుమార్లు వాయిదా....

Ram Charan Role Trimmed In Acharya
Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘ఆచార్య’ ఎట్టకేలకు ఈనెల 29న రిలీజ్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఇటవీల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందా అని చిత్ర వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Acharya: ఆచార్య ట్రైలర్‌తో తొలి రికార్డు కొట్టేందుకు రెడీ అవుతున్న మెగాస్టార్!
ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ‘ఆచార్య’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాగా ఈ సినిమా ట్రైలర్‌లో చరణ్ పాత్రకు సంబంధించిన ఇంట్రో చూసి ప్రేక్షకులు ఈ సినిమాలో ఆయనది కీలక పాత్ర అయి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. కేమియో పాత్రగా కాకుండా చరణ్ ఈ సినిమాలో మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో, స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండే పాత్రలో కనిపిస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే నిజానికి ఈ సినిమాలో చరణ్ పాత్ర నిడివి చాలా పెద్దదేనట. కానీ సినిమా రన్‌టైమ్‌కు ఇది పెద్ద సమస్యగా మారడంతో, ఆచార్య చిత్రంలో చరణ్ పాత్ర నిడివిని తగ్గించేస్తున్నారట చిత్ర యూనిట్.
Acharya: గెస్ట్ రోల్ ఎవరిది.. చిరుదా..? చెర్రీదా..?
ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. చరణ్ పాత్రకు సంబంధించిన ముఖ్యమైన సీన్స్ తొలగించకుండా, సినిమాలో ఇతర పాత్రలను చిత్ర యూనిట్ తొలగిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, చరణ్ సరసన మరో స్టార్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఆచార్య చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలతో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.