Acharya: ఆచార్య ట్రైలర్‌తో తొలి రికార్డు కొట్టేందుకు రెడీ అవుతున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఎట్టకేలకు వేసవి కానుకగా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్’కు రెడీ అవుతోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ....

Acharya: ఆచార్య ట్రైలర్‌తో తొలి రికార్డు కొట్టేందుకు రెడీ అవుతున్న మెగాస్టార్!

Chiranjeevi To Hit First Ever Record With Acharya Trailer

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఎట్టకేలకు వేసవి కానుకగా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్’కు రెడీ అవుతోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియెన్స్‌లోనూ విపరీతమైన క్రేజ్ నెలకొనగా, ఈ చిత్ర ట్రైలర్‌తో ఆ క్రేజ్‌ను డబుల్ చేసింది చిత్ర యూనిట్. ఇటీవల ఆచార్య ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, దానికి స్టన్నింగ్ రెస్పాన్స్ లభిస్తోంది.

Acharya: ఆచార్యగా వచ్చేసిన మెగా హీరోలు.. అదిరిపోయిన ట్రైలర్!

నెవర్ బిఫోర్ లుక్‌లో చిరుని చూసిన మెగా ఫ్యాన్స్ ఆచార్య చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అదిరపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై చిత్ర యూనిట్‌తో పాటు సినీ వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఆచార్య ట్రైలర్ తొలిసారి నెవర్ బిఫోర్ మెగా రికార్డుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉన్న ఆచార్య ట్రైలర్‌కు యూట్యూబ్‌లో ఏకంగా 9.6 లక్షల లైకులు రావడం విశేషం. అంతేగాక 2.5+ మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న ఆచార్య ట్రైలర్, త్వరలోనే 1 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేయనుంది.

Acharya: గెస్ట్ రోల్ ఎవరిది.. చిరుదా..? చెర్రీదా..?

మెగాస్టార్ కెరీర్‌లోనే ఆచార్య ట్రైలర్ ఈ ఫీట్ సాధించిన తొలి ట్రైలర్‌గా నిలవనుంది. పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాగా దర్శకుడు కొరటాల ఆచార్య చిత్రాన్ని తీర్చిదిద్దగా, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా చరణ్ సరసన మరో బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలతో కలిసి చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే ఏప్రిల్ 29 వరకు వెయిట్ చేయాల్సిందే.