Ram Charan: చెర్రీ వేరియేషన్స్.. శంకర్ కోసం నాలుగు గెటప్స్?

ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ హడావిడీ ముగిసింది. రామ్ చరణ్ నెక్ట్స్ టార్గెట్ ఇప్పుడు శంకర్ ప్రాజెక్ట్. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ రీస్టార్ట్ కాబోతుంది. అయితే రంగస్థలం తర్వాత క్యారెక్టర్..

Ram Charan: చెర్రీ వేరియేషన్స్.. శంకర్ కోసం నాలుగు గెటప్స్?

Rc15

Ram Charan: ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ హడావిడీ ముగిసింది. రామ్ చరణ్ నెక్ట్స్ టార్గెట్ ఇప్పుడు శంకర్ ప్రాజెక్ట్. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ రీస్టార్ట్ కాబోతుంది. అయితే రంగస్థలం తర్వాత క్యారెక్టర్ వేరియేషన్స్ చూపించాలని గట్టిగా డిసైడ్ అయిన మెగాపవర్ స్టార్.. శంకర్ కోసం, ఈ తర్వాత గౌతమ్ తిన్ననూరి కోసం కూడా సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నాడు.

Ram Charan: ముంబై థియేటర్లో చెర్రీ.. ప్రేక్షకులకు సడెన్ సర్పైజ్!

ఏప్రిల్ 6 నుంచి శంకర్-చరణ్ ప్రాజెక్ట్ రీస్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేశారు వీళ్లు. ఇక మూడో షెడ్యూల్ కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈమధ్యే ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం పంజాబ్ లోని అమృత్ సర్ కి వెళ్లొచ్చిన చరణ్.. మళ్లీ శంకర్ మూవీ షూటింగ్ కోసం అక్కడికే వెళ్లబోతున్నారు. అక్కడే దాదాపు 25 రోజుల లాంగ్ షెడ్యూల్ లో మెగా పవర్ స్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు శంకర్. త్వరగా సినిమాను పూర్తి చేస్తే వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్.

Ram Charan: ఆచార్య కోసం సిద్ధ మొదలుపెట్టాడు!

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న శంకర్ సినిమాలో రామ్ చరణ్ 4 గెటప్ ల లో కనిపించనున్నారు. యంగ్ అండ్ డైనమిక్ గా కనిపించే కలెక్టర్ రోల్ తో పాటూ యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ చేస్తోన్న చరణ్.. శంకర్ భారతీయుడులో కమల్ హాసన్ లా వృద్ధుడి పాత్రలోనూ మెస్మరైజ్ చేయబోతున్నారు. యువకుడు, కలెక్టర్, ఓల్డ్ ఏజ్డ్ క్యారెక్టర్ తో చరణ్ చేసే నాలుగో క్యారెక్టర్ పై అప్డేట్ రావాల్సిఉంది.

Ram Charan: చెర్రీ డిజిటల్ ఎంట్రీ.. హాలీవుడ్ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ?

రంగస్థలం తర్వాత క్యారెక్టర్ వేరియేషన్స్ చూపిస్తున్నారు చరణ్. చిట్టిబాబుగా జనాల్ని మెప్పించి సీతారామరాజుగా అద్దరగొట్టారు. త్వరలోనే ఆచార్యతో సిద్ధగా పలకరించబోతున్నారు. ఇక శంకర్ మూవీ కోసం ఒకే సినిమాలో నాలుగు క్యారెక్టర్స్ చేస్తోన్న రామ్ చరణ్.. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కోసం స్పోర్ట్స్ మెన్ గా అట్రాక్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.