Ram Charan: ఆచార్య కోసం సిద్ధ మొదలుపెట్టాడు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా RRR చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా.....

Ram Charan: ఆచార్య కోసం సిద్ధ మొదలుపెట్టాడు!

Ram Charan Starts Dubbing For Acharya

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా RRR చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా, ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించాడు. ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా జక్కన్న తెరకెక్కించగా, చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించాడు. చరణ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మరో లెవెల్‌లో ఉండటంతో ప్రేక్షకులు ఆయన నటనకు కితాబిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కావడంతో, చరణ్ తన నెక్ట్స్ మూవీలపై ఫోకస్ పెట్టాడు.

Ram Charan: చెర్రీ డిజిటల్ ఎంట్రీ.. హాలీవుడ్ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ?

ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొంతమేర షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా తరువాత షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు చరణ్. కాగా ఈ సినిమా కంటే ముందే చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఓ సరికొత్త పాత్రలో మనకు కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ కూడా నటిస్తున్నాడు.

అయితే తాజాగా సిద్ధ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను చరణ్ శుక్రవారం మొదలుపెట్టాడు. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో, వీలైనంత త్వరగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ముగించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తాడని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది.

Ram Charan: చరణ్‌కు బాలీవుడ్ కంపెనీల ఎర..?

చిరంజీవి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఆచార్య చిత్రాన్ని నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. గతేడాదే రిలీజ్ కావాల్సిన ఆచార్య, కరోనా నేపథ్యంలో వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 29న ఆచార్యను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.