Rana Daggubati : ట్రైన్ టికెట్ కన్‌ఫార్మ్ చేస్తానంటున్న రానా..

బాహుబలి సినిమాలో నటించి ప్రభాస్‌తో సమానంగా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు 'రానా దగ్గుపాటి'. తాజాగా ఈ హీరో ‘ట్రైన్ టికెట్ టైగర్’ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. రేపటి నుంచి మీ స్క్రీన్స్‌లో ప్రీమియర్ కానుంది అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇది సినిమా ఏమి కాదు. ఇది ఒక టికెట్ బుకింగ్ యాప్ కి సంబంధించిన యాడ్.

Rana Daggubati : ట్రైన్ టికెట్ కన్‌ఫార్మ్ చేస్తానంటున్న రానా..

Rana Daggubati Brand ambassador for confirm ticket

Rana Daggubati : బాహుబలి సినిమాలో నటించి ప్రభాస్‌తో సమానంగా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు ‘రానా దగ్గుపాటి’. ఈ హీరో చివరిగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది. దీని తరువాత బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ నటిస్తున్నాడు.

Rana Daggubati: ట్రైన్ టికెట్ టైగర్ అంటూ కన్ఫ్యూజన్ పడేసిన రానా..!

తాజాగా ఈ హీరో ‘ట్రైన్ టికెట్ టైగర్’ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. రేపటి నుంచి మీ స్క్రీన్స్‌లో ప్రీమియర్ కానుంది అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ప్రేక్షకులు అంతా ఇది ఎప్పుడు చేశాడు, అసలు ఇది సినిమానా? వెబ్ సిరీసా? అని తెలియక కన్‌ఫ్యూషన్‌లో పడ్డారు. అయితే ఇది సినిమా ఏమి కాదు. ఇది ఒక టికెట్ బుకింగ్ యాప్ కి సంబంధించిన యాడ్.

కన్‌ఫార్మ్ టికెట్ అనే సంస్థకి రానా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్‌ఫార్మ్ అవ్వడానికి ఎంత అవకాశం ఉందొ అని తెలుసుకోడానికి ఈ యాప్ సహాయ పడుతుంది. ఐఆర్‌సిటిసి అధికార ఒప్పందంతో 2021లో దీనిని ఇక్సిగో గ్రూప్ స్వాధీనం చేసుకుంది. మంచి స్టార్ ఇమేజ్ ఉన్న రానా తమ యాప్‌కి ‘ట్రైన్ టికెట్ టైగర్’ పేరుతో ప్రచారకర్తగా వ్యవహరించబోతున్నట్లు కన్‌ఫార్మ్ టికెట్ యాజమాన్యం నేడు తెలియజేసింది.