Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!

అందాల భామ సాయి పల్లవి అంటే టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల ఆమె నటించిన విరాటపర్వం సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి....

Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!
ad

Sai Pallavi: అందాల భామ సాయి పల్లవి అంటే టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల ఆమె నటించిన విరాటపర్వం సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి తన కెరీర్‌లోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అంతలా విరాటపర్వం చిత్రంలో సాయి పల్లవి ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అదేంటి.. అమ్మడు అప్పుడే తన నెక్ట్స్ సినిమాను కూడా రెడీ చేసిందా అని అనుకుంటున్నారా.. అయితే ఆమె రెడీ చేసింది తెలుగు సినిమాను కాదులెండీ.

Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

తమిళ దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కిస్తున్న ‘గార్గి’ సినిమాలో సాయి పల్లవి ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను లాంఛ్ చేసేందుకు నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి రెడీ అయ్యారు. సాయి పల్లవితో ఈ ఇద్దరు హీరోలు కూడా సినిమాలు చేయడంతో, వారితో ఆమె మంచి స్నేహాన్ని ఏర్పర్చుకుంది. ఈ కారణంగా, తన సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను లాంఛ్ చేయాలని ఆమె కోరడం, వారు వెంటనే ఓకే అనడం జరిగిపోయాయి.

Sai Pallavi : సినిమాలకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ పని చేస్తాను..

ఇక ‘గార్గి’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు రానా, నాని చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో కాళీ వెంకట్, శరవణన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ‘96’ చిత్ర ఫేం గోవింద్ వసంత ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సాయి పల్లవి ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక గార్గి చిత్రాన్ని జూలై 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.