Rao Ramesh : ‘మ‌హా స‌ముద్రం’ లో ‘గూని బాబ్జీ’ గా వెర్సటైల్ యాక్టర్ రావు ర‌మేష్‌..

రావు ర‌మేష్ ‘గూని బాబ్జీ’ గా ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిపారు.. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్‌కి రావు రమేష్ త‌న‌దైన న‌ట‌న‌తో పూర్తి న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు..

Rao Ramesh : ‘మ‌హా స‌ముద్రం’ లో ‘గూని బాబ్జీ’ గా వెర్సటైల్ యాక్టర్ రావు ర‌మేష్‌..

Rao Ramesh Firstlook From Maha Samudram Movie

Rao Ramesh: వెర్సటైల్ యాక్టర్ రావు ర‌మేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న ‘మ‌హా స‌ముద్రం’ చిత్రం నుండి రావు ర‌మేష్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్ట‌ర్‌తో పాటు ఈ మూవీలో రావు ర‌మేష్ ‘గూని బాబ్జీ’ గా ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిపారు. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్‌కి రావు రమేష్ త‌న‌దైన న‌ట‌న‌తో పూర్తి న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు.

యంగ్ హీరోస్ శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ‘మ‌హా స‌ముద్రం’ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్, అదితి రావు హైద‌రి, అనూ ఇమ్మాన్యుయేల్, జ‌గ‌ప‌తి బాబు లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Rao Ramesh

ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.