Judgement: యావజ్జీవ శిక్ష వేశారని న్యాయమూర్తిపైకి చెప్పు విసిరిన దోషి

గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది.

Judgement: యావజ్జీవ శిక్ష వేశారని న్యాయమూర్తిపైకి చెప్పు విసిరిన దోషి

Judgement

Judgement: గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. తనకు యావజ్జీవ కారాగార శిక్ష వేశారని హత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఏకంగా న్యాయమూర్తిపైనే ఆగ్రహించాడు. తన చెప్పు తీసి జడ్జి పైకి విసిరేశాడు. అదృష్టవశాత్తు అది టార్గెట్ మిస్ అయి పక్కకు పడింది.

ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, ఆమె హత్య కేసులో దోషిగా తేలిన సుజీత్ సాకేత్‌కు పోక్సో కోర్టు యావజ్జీవ ఖైదు శిక్ష విధించింది. కానీ, ఈ తీర్పు అతనిలో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయమూర్తి పీఎస్ కాలాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయనపైకి చెప్పును విసిరాడు.

విచారణ ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల సుజీత్ సాకేత్‌ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటిలో ఒంటరిగా కనిపించిన ఐదేళ్ల చిన్నారిపై కన్నేశాడు. చాక్లెట్‌తో ఆశ చూపి ఇంటి బయటకు తీసుకెళ్లాడు. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి బాలికను రేప్ చేశాడు. అనంతరం ఉరి వేసి హతమార్చాడు.

ఈ ఏడాది ఏప్రిల్ 30న జరిగిన ఈ ఘటనలో అరెస్టైన సుజీత్ సాకేత్‌ దోషిగా తేలడంతో కోర్టు అతనికి శిక్షను విధించింది. సుజీత్ సాకేత్ బతికినన్ని రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది.