Rashmika Mandanna: క్రస్మిక అందాల వల.. పుష్ప ప్రమోషన్స్‌లో గ్లామర్ షో!

నేషనల్ క్రష్ అన్న పేరును నిలబెట్టుకుంటోంది రష్మికా. కొత్తగా వచ్చిన పేరు క్రష్మికకు 100 పర్సెంట్ న్యాయం చేసేలా తయారైంది. గ్లామర్ డోస్ పెంచేదే గాని తగ్గేదేలే అని డైరెక్ట్ గానే..

Rashmika Mandanna: క్రస్మిక అందాల వల.. పుష్ప ప్రమోషన్స్‌లో గ్లామర్ షో!

Rashmika Mandanna

Rashmika Mandanna: నేషనల్ క్రష్ అన్న పేరును నిలబెట్టుకుంటోంది రష్మికా. కొత్తగా వచ్చిన పేరు క్రష్మికకు 100 పర్సెంట్ న్యాయం చేసేలా తయారైంది. గ్లామర్ డోస్ పెంచేదే గాని తగ్గేదేలే అని డైరెక్ట్ గానే చెప్పేస్తోంది. పుష్ప సినిమాలోనే కాదు.. ఆ సినిమా ప్రమోషన్స్ లో సైతం కుర్రకారు మతిపొగొట్టేలా స్కెచ్ వేసింది కన్నడ కస్తూరి. గ్లామర్ విషయంలో తగ్గేదే అంటోంది రష్మికా మంథన్నా. పుష్పలో డీ గ్లామరస్ గా కనిపించినా.. పుష్ప ప్రమోషన్స్ లో మాత్రం ఫుల్ గ్లామర్ షో చేసింది. ఒకదానికి మించి ఒకటి అన్నట్టు.. రాష్ట్రం మారినప్పుడల్లా మామూలు రచ్చ చేయలేదు.

Bheemla Nayak: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. సంక్రాంతి టార్గెట్ అందుకుంటాడా?

నిజానికి పుష్పలో చేసింది డీగ్లామర్ రోల్ అయినా.. కన్నడ కస్తూరికి మంచి మార్కులే పడ్డాయి. సామి సామి పాటలో తన ఫ్యాన్స్ కి కావాల్సినంత గ్లామర్ విందును వడ్డించింది. ఆ పాటలోని స్టెప్పులతోనే ప్రమోషనల్ స్టంట్స్ ను ఓ రేంజ్ లో చూపించింది. పుష్ప ప్రచారాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పక్కా ప్లాన్ అమలు చేసింది రష్మిక. బన్నీతో కలిసి ప్రమోషన్స్ కి వెళ్లిన రష్మిక.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ముంబైల్లో జరిగిన ప్రెస్ మీట్స్ లో ఓవర్ డోస్ గ్లామర్ షో చేసింది. ఒక్కో ప్రెస్ మీట్ కి ఒక్కోలా డ్రెస్సింగ్ చేసుకుని అక్కడి వారి అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో రష్మిక 100 పర్సెంట్ సక్సెసయింది.

Bangarraju: వాసివాడి తస్సదియ్యా టీజర్.. చిట్టితో అక్కినేని హీరోల అల్లరి డాన్స్!

హైదరాబాద్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ శారీతో ఎక్స్ పోజ్ చేసిన రష్మికా.. ఆ తర్వాత కన్నడ ఆడియెన్స్ ను బ్లాక్ కలర్ టూ పీస్ డిజైనర్ వేర్ తో అలరించింది. మల్లూ ఫ్యాన్స్ ను బ్లూకలర్ లెహెంగా వేర్ తో.. నార్త్ వాళ్లకి గ్రీన్ కలర్ లెహెంగాతో గాలం వేసింది. వీటికి తగ్గట్టు రష్మికను ముద్దుగా క్రష్మికా అని పిలుస్తానంటూ మరింత హీట్ పెంచారు ఐకాన్ స్టార్. చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన రష్మిక సినిమా పుష్ప. సో ఆడియెన్స్ ఎంగేజ్ చేసేందుకు బాగానే ట్రై చేసింది.

Sai Pallavi: ఒక్కటే పీస్.. తెలుగు తెరపై హైబ్రీడ్ పర్ఫామెన్స్!

ఈ ప్యాన్ ఇండియా సినిమాతో బలంగా ప్రేక్షకుల మదిలో ముద్ర వేస్తేనే.. రాబోయే సినిమాలతో ఫుల్ కలరింగ్ ఇవ్వొచ్చు. ఇప్పుడు ఈ కన్నడ బ్యూటీ చేతిలో టాలీవుడ్ ప్రాజెక్ట్స్ పుష్ప 2, ఆడవాళ్లు మీకు జోహార్లుతో పాటూ.. బాలీవుడ్ సినిమాలు మిషన్ మజ్ను, గుడ్ బై ఉన్నాయి. ఇక త్వరలోనే మరికొన్ని క్రేజీ సినిమాలకు కమిట్మెంట్స్ ఇవ్వబోతుంది. సో ఇలాంటి ప్రీషియస్ టైమ్ లో హెడ్ లైన్స్ లో నిలవాలంటే గ్లామర్ పాట్లు తప్పవని చెప్పకనే చెప్తోంది నేషనల్ క్రష్.