IPL 2023, RR Vs CSK:తోపు బౌల‌ర్ల వ‌ల్ల‌కానిది అశ్విన్‌కే సాధ్య‌మైంది

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఐదుగురు కాదు ఏకంగా 20 మంది బ్యాట‌ర్ల‌ను డ‌కౌట్ చేసిన తొలి బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.చెన్నై సూప‌ర్‌కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అంబ‌టి రాయుడుని ఔట్ చేయ‌డం ద్వారా అశ్విన్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

IPL 2023, RR Vs CSK:తోపు బౌల‌ర్ల వ‌ల్ల‌కానిది అశ్విన్‌కే సాధ్య‌మైంది

Ravichandran Ashwin

IPL 2023, RR Vs CSK: ఐపీఎల్ అంటే బ్యాట‌ర్ల గేమ్ అని అంటారు. సిక్స‌ర్లు, ఫోర్లు కొడుతూ బౌల‌ర్ల‌కు నిద్ర‌లేని రాత్రుళ్లు మిగులుస్తుంటారు బ్యాటర్లు. అయితే అలాంటి బ్యాట‌ర్ల‌కు కూడా ఓ బౌల‌ర్‌ను చూస్తే వెన్నులో వ‌ణుకు పుట్టాస్తిందే. అత‌డే టీమ్ఇండియా సీనియ‌ర్ బౌల‌ర్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆల్‌రౌండ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(Ravichandran Ashwin). ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఐదుగురు కాదు ఏకంగా 20 మంది బ్యాట‌ర్ల‌ను డ‌కౌట్ చేసిన తొలి బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు.

గురువారం చెన్నై సూప‌ర్‌కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అంబ‌టి రాయుడుని ఔట్ చేయ‌డం ద్వారా అశ్విన్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవ‌ర్లు వేసిన అశ్విన్ 35 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న అజింక్యా ర‌హానేతో అంబ‌టి రాయుడి ఒకే ఓవ‌ర్‌లో ఔట్ చేసి చెన్నైని గ‌ట్టి దెబ్బ‌తీశాడు. 2009లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన అశ్విన్ ఇప్ప‌టి వ‌ర‌కు 192 మ్యాచ్‌లు ఆడి 168 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

IPL 2023, RR vs CSK: చెన్నైకి షాక్‌.. వ‌రుస విజ‌యాల‌కు బ్రేక్‌.. రాజ‌స్థాన్ గెలుపు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైశ్వాల్‌(77; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దంచికొట్ట‌గా ఆఖ‌ర్లో ధ్రువ్ జురెల్(34; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), దేవదత్ పడిక్కల్(27 నాటౌట్‌; 13 బంతుల్లో 4 ఫోర్లు) ధాటిగా ఆడ‌డంతో రాజ‌స్థాన్ భారీ స్కోర్ చేసింది. చెన్నై బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీయ‌గా మ‌హేశ్ తీక్ష‌ణ‌, ర‌వీంద్ర జ‌డేజా ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ల‌క్ష్య ఛేద‌న‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది. దీంతో రాజ‌స్థాన్ 32 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబే(52; 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించ‌గా రుతురాజ్ గైక్వాడ్(47; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడినా ఫ‌లితం లేకుండా పోయింది.

Wrestlers: రెజ్లర్ల దెబ్బ అంటే అది మరీ.. ఎట్టకేలకు పంతాన్ని నెగ్గించుకున్నారు.. అసలు ఆట ఇప్పుడు షురూ